Phone Tapping In YCP : తన ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలని కేంద్ర హోమ్‌శాఖకు కోటంరెడ్డి ఫిర్యాదు

తన ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలని కేంద్ర హోమ్‌శాఖకు కోటంరెడ్డి ఫిర్యాదు చేశారు.

Phone Tapping In YCP : నెల్లూరు జిల్లా రాజకీయాలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. నా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందు ప్రకటించినప్పటనుంచి ఈ హీట్ పెరుగుతోంది. సొంతపార్టీవారే నా ఫోన్ ట్యాపింగ్ చేసి..నన్ను అనుమానించి అవమానించారని నా వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారని ఆదేవన వ్యక్తం చేసిన కోటంరెడ్డిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. పార్టీ మారటానికి కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.

దీంతో నిజాలు బయటపెట్టిన నాపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారంటూ వాపోయిన కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలను మీడియా ముందే బయటపెట్టారు. ఇలా నాపై ముప్పేట దాడి చేయటం చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటంతో కోటంరెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపించాలని కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోటంరెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. నా వ్యక్తిగత అంశాలను ట్యాపింగ్ చేశారని అమిత్ షాకు రాసిన లేఖలో కోటంరెడ్డి పేర్కొన్నారు.

Janasena : కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ ఆరోపణలపై డీజీపీ ఎందుకు స్పందించట్లేదు..? : పవన్ కల్యాణ్

నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చెప్పినప్పటినుంచి వైసీపీ నేతలు నన్ను టార్గెట్ చేశారని నన్ను అరెస్ట్ చేయిస్తాం అంటూ బెదిరిస్తున్నారని..ఎన్నిసార్లు, ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా నేను నిజాలు మాట్లాడుతునే ఉంటానని స్పష్టం చేశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్ కౌంటర్ చేయండీ అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కోటంరెడ్డి. నాపై ఎన్ని కేసులు పెట్టినా నా గొంతు ఆగదు..అరెస్ట్ చేస్తానని బెదిరించటం కాదు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి అంటూ సవాల్ విసిరారు. నాపై ఎన్ని కేసులు పెట్టినా నా గొంతు ఆగదని..నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్ కౌంటర్ చేయండీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రశ్నించేవారిని నిజాలు మాట్లాడేవారిని అరెస్ట్ చేయించటం..అక్రమ కేసులు పెట్టటం అలవాటుగా మారినవారికి నన్ను అరెస్ట్ చేయటం ఏమంత పెద్ద విషయం కాదన్నారు కోటంరెడ్డి.

Phone Tapping In YCP : నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్‌కౌంటర్ చేయండి : కోటంరెడ్డి

కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోటంరెడ్డి ఆరోపణలు చేసిన మరునాడే మరో వైసీపీ నేత..వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ ఆరోపించారు.  నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానం ఖంగుతింది. ఇలా విమర్శలు చేసినవారిని అణిచివేయాలని ఆఘమేఘాలమీద ముఖ్య నేతలతో సమావేశమైంది. పార్టీ ఇన్ చార్జ్ ను నియమించటానికి కసరత్తులు మొదలుపెట్టింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అయితే మరో అడుగు ముందుకేసి తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కేవలం ఆరోపణలు కాదు పచ్చి నిజం అంటూ సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు బయటపెట్టారు. దీంతో మాటల దాడితో విరుచుకుపడేవారిని రంగంలోకి దింపి ఎదురు దాడి చేయిస్తోంది అధిష్టానం.

Phone Tapping In YCP : నాపై కిడ్నాప్ కేసు కాదు మర్డర్ కేసు పెట్టుకోండి..నాకు బెదిరింపులొస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్ జాగ్రత్త : వైసీపీ నేతలకు కోటంరెడ్డి కౌంటర్







                                    

ట్రెండింగ్ వార్తలు