Phone Tapping In YCP : నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్‌కౌంటర్ చేయండి : కోటంరెడ్డి

నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్ కౌంటర్ చేయండీ అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కోటంరెడ్డి. నాపై ఎన్ని కేసులు పెట్టినా నా గొంతు ఆగదు..అరెస్ట్ చేస్తానని బెదిరించటం కాదు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి అంటూ సవాల్ విసిరారు.

Phone Tapping In YCP :  నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్‌కౌంటర్ చేయండి : కోటంరెడ్డి

Phone Tapping In YCP

Phone Tapping In YCP : నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చెప్పినప్పటినుంచి వైసీపీ నేతలు నన్ను టార్గెట్ చేశారని నన్ను అరెస్ట్ చేయిస్తాం అంటూ బెదిరిస్తున్నారని..ఎన్నిసార్లు, ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా నేను నిజాలు మాట్లాడుతునే ఉంటానని స్పష్టం చేశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్ కౌంటర్ చేయండీ అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కోటంరెడ్డి. నాపై ఎన్ని కేసులు పెట్టినా నా గొంతు ఆగదు..అరెస్ట్ చేస్తానని బెదిరించటం కాదు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి అంటూ సవాల్ విసిరారు. నాపై ఎన్ని కేసులు పెట్టినా నా గొంతు ఆగదని..నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్ కౌంటర్ చేయండీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రశ్నించేవారిని నిజాలు మాట్లాడేవారిని అరెస్ట్ చేయించటం..అక్రమ కేసులు పెట్టటం అలవాటుగా మారినవారికి నన్ను అరెస్ట్ చేయటం ఏమంత పెద్ద విషయం కాదన్నారు కోటంరెడ్డి.

Phone Tapping In YCP : ఒక్కడ్ని చేసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు.. : కోటం రెడ్డి

ఇటువంటి తీరుతో నేతల్లో పార్టీమీద ఉన్న నమ్మకంపోతోందని..ప్రశ్నిస్తే బెదిరింపులు పర్వంగా మారిందన్నారు. ఇటువంటి వేధింపులు భరించలేకే ఎంతోమంది నేతలు పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారని అలా చాలామంది ఎమ్మెల్యేలు తనకు ఆ విషయం చెప్పారని అన్నారు కోటంరెడ్డి. నలుగురు మంత్రలు,35మంది ఎమ్మెల్యేలు పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు. మీరు ధైర్యం చేసి బయటకు బహిరంగంగా చెప్పుకున్నారు.. కానీ మేం బయటపడలేకపోతున్నామన్నారు అన్నారు.

Janasena : కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ ఆరోపణలపై డీజీపీ ఎందుకు స్పందించట్లేదు..? : పవన్ కల్యాణ్

మరి కోటంరెడ్డి చెప్పిన ఆ నలుగురు మంత్రులు ఎవరు? ఆ 35మంది ఎమ్మెల్యేలు ఎవరు? అని తెలుసుకునే పనిలో వైసీపీ అధిష్టానం బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కోటంరెడ్డి ఇచ్చిన లీకులతో ముందుగానే జాగ్రత్త పడే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఇలా నెల్లూరు జిల్లా వైసీపీలో ముసలం రాజుకుంది. ఇది అంతకంతకూ పెరుగుతోంది. ఈక్రమంలో ఇక వీరిద్దరు వైసీపీకి గుడ్ బై చెప్పి మరోపార్టీలో చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తాను టీడీపీలో చేరతాను అంటూ బహిరంగంగా కోటంరెడ్డి చెప్పేశారు. ఇక ఆనం కూడా వెంకటగిరిలో టీడీపీ బలంగా ఉంది అంటూ తాను కూడా టీడీపీపై మొగ్గుచూపుతున్నట్లుగా కనిపిస్తున్నారు. మరి కోటంరెడ్డి చెబుతున్న ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.

Phone Tapping In YCP : ముగ్గురు వచ్చారు,వెళ్లారు ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చారు : అధిష్టానంపై YCP MLA ఆనం సెటైర్లు

ఇసుక అక్రమాలపై మాట్లాడే ధైర్యం నీకుందా? అంటూ అనిల్ కుమార్ ను ప్రశ్నించారు కోటంరెడ్డి. నీ గెలుపుకు కారణం ఎవరో మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడే నువ్వు నమ్మక ద్రోహం గురించి మాట్లాడుతున్నావా? అంటూ ప్రశ్నించారు. నిన్ను రాజకీయాల్లో గెలిపించిన వ్యక్తినే కొడతానన్నావ్..అటువంటి నీకు నమ్మక ద్రోహం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.