Phone Tapping In YCP : ఒక్కడ్ని చేసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు.. : కోటం రెడ్డి

ఒక్కడ్ని చేసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు..నేను తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు అంటూ వైసీపీ నేతల విమర్శలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి.

Phone Tapping In YCP : ఒక్కడ్ని చేసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు.. : కోటం రెడ్డి

Phone Tapping In YCP

Phone Tapping In YCP :  నా ఫోన్ ట్యాప్ జరిగింది నిజం..ఆ విషయాన్ని బయటపెడితే నాపై మూకుమ్మడి దాడి చేస్తున్నారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాపోయారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కోసం ఆరోపణలు చేయటమే కాదు సాక్ష్యాలను కూడా చూపెట్టారు. దీంతో కోటంరెడ్డిపై వైసీపీ నేతలు మాటల యుద్ధం ప్రారంభించారు. సజ్జల, కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్,మంత్రి కాకాణి,పేర్నినాని ఇలా ప్రెస్ మీట్ లు పెట్టి మరీ కోటంరెడ్డిపై మాటల దాడి మొదలుపెట్టారు. పేర్ని నాని అయితే కోటంరెడ్డి ఫోన్ కాల్ రికార్డు చేస్తే ట్యాపింగ్ అంటూ రాద్ధాంతం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కోటంరెడ్డి మిత్రుడు కాల్ రికార్డ్ చేశారని..వీడియోతో పాటు టెక్ట్స్ కూడా ఉంది అంటూ దాన్ని ట్యాప్ అంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు పేర్ని నాని.

Phone Tapping In YCP : కోటంరెడ్డి ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే దాన్ని ట్యాపింగ్ అంటూ రాద్ధాంతమేంటీ : పేర్నినాని

ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బయటపెట్టినప్పటినుంచి వైసీపీ నేతలు నాపై మాటలతో మూకుమ్మడి దాడి చేస్తున్నారని నేను తప్పు చేసుంటే దేవుడే నన్ను శిక్షిస్తాడు అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కోటంరెడ్డిని నమ్మవద్దని నేను జగన్ ను చెబుతునే ఉన్నాను కానీ జగన్ మాత్రం బాగానమ్మారు అటువంటి జగన్ కు కోటం రెడ్డి ద్రోహం చేశారనంటూ పేర్ని నాని చేసిన విమర్శలపై స్పందిస్తూ నేను జగన్ కు ద్రోహం చేసి ఉంటే..దేవుడు నన్ను శిక్షించాలని ప్రార్థిస్తున్నానని..తప్పు చేయకపోతే దేవుడే నాకు అండగా ఉంటాడు అంటూ ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ కోటంరెడ్డికి సవాల్ విసురుతు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిరూపిస్తే నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను..దీనికి నువ్వు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. దీనిపై కోటం రెడ్డి స్పందిస్తూ నేను ఇప్పటి వరకు అనిల్ కుమార్ యాదవ్ ను ఎప్పుడు ఏమీ అనలేదు. అనిల్ పై నేు ఎప్పుడు పై ఎత్తులు వేయాదని అటువంటిది నా మాటలు ఎందుకు నమ్మలేదంటూ వాపోయారు. చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేశా కానీ నన్ను ఎన్నో అవమానాలకు గురి చేశారు. నా నియోజక వర్గం అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే ద్రోహం చేశానంటూ ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు కోటంరెడ్డి.

Janasena : కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ ఆరోపణలపై డీజీపీ ఎందుకు స్పందించట్లేదు..? : పవన్ కల్యాణ్

కాగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఇలా నెల్లూరు జిల్లా వైసీపీలో ముసలం రాజుకుంది. ఇది అంతకంతకూ పెరుగుతోంది. ఈక్రమంలో ఇక వీరిద్దరు వైసీపీకి గుడ్ బై చెప్పి మరోపార్టీలో చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తాను టీడీపీలో చేరతాను అంటూ బహిరంగంగా కోటంరెడ్డి చెప్పాశారు. ఇక ఆనం కూడా వెంకటగిరిలో టీడీపీ బలంగా ఉంది అంటూ తాను కూడా టీడీపీపై మొగ్గుచూపుతున్నట్లుగా కనిపిస్తున్నారు. కాగా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నాయకులకు ఆఫర్ ప్రకటిస్తూ ఆపరేషన్ ఆకర్ష్ ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో నెల్లూరు మొత్తం వైసీపీ జెండా ఎగిరిన క్రమంలో ఇక 2024 ఎన్నికల్లో ఈ పరిస్థితి మారి టీడీపీ ప్రాభవం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.