Phone Tapping In YCP : కోటంరెడ్డి ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే దాన్ని ట్యాపింగ్ అంటూ రాద్ధాంతమేంటీ : పేర్నినాని
కోటంరెడ్డి ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే దాన్ని ట్యాపింగ్ అంటూ రాద్ధాంతమేంటీ అంటూ విరుచుకుపడ్డారు వైసీపీ నేత పేర్నినాని.

Phone Tapping In YCP : తన ఫోన్ ట్యాప్ చేశారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడుతూ..కోటంరెడ్డి ఫోన్ టాపింగ్ కాదు జస్ట్ ఫోన్ కాల్ రికార్డింగ్ జరిగింది. ఫోన్ కాల్ రికార్డింగ్ ను ట్యాప్ చేశారు అంటూ ప్రచారం చేస్తున్నారు..ఈ రాద్ధాంత ఏంటీ అంటూ ప్రశ్నించారు. రికార్డింగ్ కు ట్యాపింగ్ కు తేడా లేదా? తేడా తెలియదా? అంటూ సరికొత్త పాయింట్ పట్టుకొచ్చారు పేర్నినాని. కోటంరెడ్డి మిత్రుడు కాల్ రికార్డ్ చేశారని..వీడియోతో పాటు టెక్ట్స్ కూడా ఉంది అంటూ దాన్ని ట్యాప్ అంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు పేర్ని నాని.
అయినా మా పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా ఎందుకు పెడతాం? ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తాం అంటూ ప్రశ్నించారు. పార్టీ మారటానికి అన్ని ప్లాన్లు వేసుకున్నాకే కోటం రెడ్డి ఫోన్ ట్యాప్ అంటూ హడావిడి చేస్తున్నారని లోకేశ్ తో కోటంరెడ్డి ఎప్పటినుంచో టచ్ లో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. ఒక పార్టీలో ఉండి మరో పార్టీవైపు చూడటం సరికాదంటూ నీతులు చెప్పారు. జగన్ కు కోటంరెడ్డి ద్రోహం చేశారు అంటూ విమర్శించారు. మనకు తప్పుడు ఆలోచనలు లేవు, అక్రమాలు చేయడం లేదనే ధీమా ఉన్నప్పుడు ఒకవేళ ఫోన్ ట్యాప్ చేసినంత మాత్రాన ఏమవుతుంది? అని ప్రశ్నించారు పేర్ని నాని.