Phone Tapping In YCP : నెల్లూరు వైసీపీలో మరో నిరసనగళం .. నిన్న ఆనం,కోటం రెడ్డి, తాజాగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి

నెల్లూరు వైసీపీలో మరో నిరసనగళం వినిపిస్తోంది. వైఎస్ కు వీర విధేయుడుని అని చెప్పుకునే వైసీపీ నేత ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ధిక్కార స్వరం సహింతునా? అంటూ విరుచుకుపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఫోన్ టాపింగ్ జరిగింది అంటూ ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధిష్టానంపై విరుచుపడుతుంటే తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ధిక్కార స్వరం వినపిస్తున్నారు.

Phone Tapping In YCP :  నెల్లూరు వైసీపీలో మరో నిరసనగళం .. నిన్న ఆనం,కోటం రెడ్డి, తాజాగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి

Phone Tapping In YCP

Phone Tapping In YCP :  నెల్లూరు పెద్దారెడ్లు గొంతు సవరించుకుంటున్నారు. సొంతపార్టీపైనే నిరసన గళాలు విప్పుతున్నారు. తమపై ఈ నిఘాలు ఏంటీ అంటూ మండిపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ లు చేస్తుమమ్మల్ని అవమానిస్తారా? అంటూ విరుచుకుపడుతున్నారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తారంటూ సాక్ష్యాలతో సహా బయటపెట్టి వైసీపీలో దుమారం సృష్టించారు. ఆ మరునాడే నెల్లూరు మరో వైసీపీ ఎమ్మెల్యే ఆనంరామనారాయణ రెడ్డి కూడా నా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆరోపించారు. ఈక్రమంలో నెల్లూరు వైసీపీలో మరో ధిక్కార స్వరం వినిపిస్తోంది. ఆయనే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి సోదరుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి.

కోటంరెడ్డి, ఆనం ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ ల వాయిస్ వినిపించేసరికి ఆఘమేఘాలమీద వైసీపీ అధినేత జగన్ తో సజ్జల భేటీ అయ్యారు. ఈ అంశంపై చర్చించారు. నెల్లూరుకు కొత్త ఇన్ చార్జ్ ను నియమించాలని నిర్ణయించారు. దీంట్లో భాగగా నెల్లూరుకు కొత్త ఇన్ చార్జ్ ని నియమించే పనిలో పడ్డ వైసీపీ అధిష్టానం ఎంపీ అదాలను సంప్రదించగా ఆయన అంగీకరించనట్లుగా తెలుస్తోంది. నెల్లూరు వైసీపీలో ముసలం కొనసాగుతున్న క్రమంలో ఇన్ చార్జ్ గా వ్యవహరించటం అంటే కత్తిమీద సాములాంటిదేనని భావిస్తున్నారు నేతలు. దీంతో ఎవ్వరు ముందుకు రావటంలేదు. దీంతో ఓ పక్క వివేకనంద హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ఇరుక్కోవటం సీబీఐ విచారణకు వెళ్లటం..మరోపక్క ఫోన్ ట్యాపింగ్ ల గొడవలతో వైసీపీ అధినేతకు దిక్కుతోచటంలేదని సమాచారం.

MLA Kotamreddy Phone Tapping : సీఎం జగన్, సజ్జల ఆదేశాలు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

దీంతో వైసీపీ పెద్దలు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. వైసీపీకి నెల్లూరు ఒకప్పుడు కంచుకోట. ఇపుడు ధిక్కారల జిల్లాగా మారిపోతోంది. ఇప్పటి వరకు వెంకటరిగి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రమానారాయణరెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేసేవారు. కానీ తాజాగా కోటం రెడ్డి కూడా జత అయ్యారు. ఆయన మరో అడుగు ముందుకేసి పార్టీలో కొనసాగలేనని టీడీపీ నుంచి పోటీ చేస్తాను అంటూ బాంబు పేల్చారు. ఈక్రమంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి మరో తలనొప్పిగా తయారయ్యారు వైసీపీ అధిష్టానికి.

మేకపాటి చంద్రశేఖరరెడ్డికి పార్టీలో ఉన్న సమస్య ఏమిటంటే..తన నియోజకవర్గంలో పరిశీలకుడిగా ఉన్న ధనుంజయరెడ్డి మీద హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పరిశీలకుడు చిచ్చు పెడుతున్నారని నాపై అతనికి పెత్తనం ఏంటీ ఎవరీ ధనుంజయరెడ్డి? నామీద పెత్తనం చేయటానికి అని నిలదీస్తున్నారు. ధనుంజయ్ వ్యవహారం గురించి నేను జగన్ వద్దా..మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి వద్దనే తేల్చుకుంటాను అని తేల్చి చెప్పారు. ఇటువంటి వ్యవహారాలతో వైసీపీకి నెల్లూరు జిల్లా పెద్ద తలనొప్పి మారింది. ఒక వైపు తాను వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిని అని చెప్పుకుంటునే మరోపక్క బహిరంగంగా పార్టీ నియమించిన పరిశీలకుడి మీద చంద్రశేఖరరెడ్డి విమర్శలు చేయడంతో గమనించాల్సిన విషయం.ఈ విమర్శల వెనుక ఉన్న అసలు కథేంటీ? కేవలం ధనుంజయ్ రెడ్డి పెత్తనం ఒక్కటేనా? మరేమన్నా ఉందా? అసలీ నెల్లూరు పెద్దారెడ్లకు ఏమైంది? ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ధిక్కార స్వరాలేంటీ? వీటిని సర్ధుబాటు చేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ భంగపాటు తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Phones Tapping In YCP : ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..బెదిరింపులకు భయపడేది లేదు : వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి

నిజానికి చంద్రశేఖరెడ్డిపై ఉదయగిరిలో తీవ్ర వ్యతిరేకత ఉందనేది టాక్. మరోసారి ఆయనకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదంటున్నారు. సర్వేలు కూడా ఇదే చెప్పాయలని సమాచారం. ఆయనపై వ్యతిరేకత ఏ రేంజ్ లో ఉందంటే వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని సొంత పార్టీలోనే చెబుతున్నారు. కానీ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

కాగా..వైసీపీపై వ్యతిరేకత బాగా పెరుగుతోందని తనతో కొంతమంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని..వారు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు. తన ఫోనే కాకుండా నలుగురు మంత్రులు, 35మంది ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతోెందని తనతో ఆ విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారంటున్నారు కోటం రెడ్డి.