MLA Kotamreddy Phone Tapping : సీఎం జగన్, సజ్జల ఆదేశాలు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

వైసీపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఫోన్ ను ట్యాపింగ్ చేశారని..తన ఫోన్ సంభాషణను దొంగచాటుగా వింటున్నారని మండిపడ్డారు.

MLA Kotamreddy Phone Tapping : సీఎం జగన్, సజ్జల ఆదేశాలు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

MLA Kotam Reddy

MLA Kotamreddy Phone Tapping : వైసీపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఫోన్ ను ట్యాపింగ్ చేశారని..తన ఫోన్ సంభాషణను దొంగచాటుగా వింటున్నారని మండిపడ్డారు. 20 రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆధారాలు దొరికాయన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి చెప్పారు.. అయినా నమ్మలేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా ఎందుకు? ఆధారాలు బయట పెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు వస్తాయని చెప్పానని పేర్కొన్నారు.  తనకు నటన చేతకాదు, మోసం చేయడం రాదన్నారు. తన నుంచి కనీసం సంజాయిషీ కూడా అడగలేదన్నారు. తనకు చెప్పకుండా ఇంచార్జీని మార్చుతారా? వైసీపీలో తనకు అనేక అవమానాలు జరిగాయని వాపోయారు.

జగన్, సజ్జల, విజయసాయిరెడ్డి.. మీ ఫోన్ లను ట్యాప్ చేసి వింటే మీ స్పందన ఎలా ఉంటుంది? అని అడిగారు. రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తను ఫోన్ చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగారని వెల్లడించారు. తన ఫ్రెండ్ తో మాట్లాడిన మాటలను తనకు పంపించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ఫోన్లనే ట్యాపింగ్ చేశారంటే.. ఇది ఎమ్మెల్యేలతో ఆగదని. మంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిస్, జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్ ల, ఎంపీలు, మీడియా యాజమాన్యాలు, విలేకర్లు.. వీరే కాకుండా ఎవరిపై కావాలనుకుంటే వారి ఫోన్లను ట్యాప్ చేస్తారని పేర్కొన్నారు. 9849966000 అనే నెంబర్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పారు. ఈ నెంబర్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుదేనని తెలిపారు.

Phones Tapping In YCP : ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..బెదిరింపులకు భయపడేది లేదు : వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ ఆడియోను వినిపించారు. ఇది ట్యాపింగ్ కాదు అని నిరూపించగలరా అని ప్రశ్నించారు. తన ఫోన్ ను దొంగ చాటుగా వినలేదని నిరూపించండి అని సవాల్ చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. పెద్దలకు తెలియకుండానే తన ఫోన్ ట్యాప్ అవుతుందా అని అడిగారు. సీఎం జగన్, సజ్జల చెప్పకుండా ఫోన్ ట్యాప్ జరుగుతుందా? అని నిలదీశారు.  ఫోన్ ట్యాప్ తో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని తెలిపారు.

బెదిరింపులకు భయపడే ప్రస్తక్తే లేదన్నారు. వైసీపీ నుంచి తప్పుకోబోతున్నానని చెప్పారు. తన మౌనాన్ని తప్పుగా చూపించి దోషిగా నిలబెట్టేయత్నం జరుగుతోందన్నారు. ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు తన వద్ద ఆధారాలున్నాయని వెల్లడించారు. అవమానం జరిగిన చోట ఉండాల్సిన అవసరం లేదన్నారు. నాయకులు నమ్మకపోతే.. పార్టీలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. సాక్ష్యాలు బయటపెడితే ఇద్దరు ఐఏఎస్ అధికారుల ఉద్యోగాలు ఊడతాయన్నారు. బాలినేని మాటలు.. సీఎం జగన్ మాటాలుగానే భావిస్తున్నానని చెప్పారు.

Andha Pradesh Politics : మా పార్టీవారే మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు..నాకు ప్రాణహాని ఉంది : వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ

తన జీవితంలో ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. వైఎస్ఆర్ పార్టీకి తాను వీర విధేయుడినని అందరికీ తెలుసన్నారు. వైసీపీలో తనకు అనేక అవమానాలు జరిగాయని పేర్కొన్నారు. వైఎస్ మీద ఉన్న ప్రేమతో తాను ఎన్నో అవమానాలు భరించానని చెప్పారు. తాను ఎక్కడా వైసీపీకి, జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. నిత్యం ప్రజల్లో ఉన్నానని.. వైసీపీకి కష్టకాలంలో అండగా నిలిచానని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే తప్పేంటని ప్రశ్నించారు.