Phone Tapping In YCP : నాపై కిడ్నాప్ కేసు కాదు మర్డర్ కేసు పెట్టుకోండి..నాకు బెదిరింపులొస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్ జాగ్రత్త : వైసీపీ నేతలకు కోటంరెడ్డి కౌంటర్

నాపై కిడ్నాప్ కేసు కాదు మర్డర్ కేసు పెట్టుకోండి ఐడోంట్ కేర్....నాకు బెదిరింపులొస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్ జాగ్రత్త అంటూ వైసీపీ నేతలకు కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Phone Tapping In YCP : నాపై కిడ్నాప్ కేసు కాదు మర్డర్ కేసు పెట్టుకోండి..నాకు బెదిరింపులొస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్ జాగ్రత్త : వైసీపీ నేతలకు కోటంరెడ్డి కౌంటర్

Kotam Reddy Sridhar Reddy Strong Counters To YCP Leaders' Criticism..Threats

Phone Tapping In YCP : వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ నేతల మాటల యుద్దమే కాదు బెదిరింపులకు కూడా దిగుతున్నారు. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేదాయిపాలెం పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదైంది.తనను ఫోన్ లో బెదించడంతోపాటు తన ఇంటి దగ్గరికి వచ్చి కిడ్నాప్ కు యత్నించారని కోటంరెడ్డిపై కార్పొరేటర్ విద్యాభాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీలను పెట్టి చంపిస్తవా అని కోటంరెడ్డిని విద్యా భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్ కూడా వచ్చింది. సీఎం జగన్ ను, పార్టీ పెద్దలను విమర్శిస్తే బండికి కట్టుకుని వెళ్తామని బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి కోటంరెడ్డిని బెదిరిస్తూ ఫోన్ చేశాడు.

Threatening Phone Call : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్

దీంతో కోటంరెడ్డి వైసీపీ నేతలకు..అభిమానులకు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. నాపై కిడ్నాప్ కేసే కాదు మర్డర్ కేసు కూడా పెట్టుకోండి బట్ ఐడోంట్ కేర్ అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు నన్ను బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయి జాగ్రత్త అంటూ ఎదురు దాడికి దిగారు. కోటంరెడ్డి జగన్ కు నమ్మక ద్రోహం చేశారంటూ మంత్రి కాకాణి విమర్శలకు కోటంరెడ్డి కౌంటర్ ఇస్తూ..వైఎస్ కుటుంబ గురించి మాట్లాడే అర్హత కాకాణికిలేదన్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు తాను మద్దతు ఇస్తే జగన్ వెంట వెళితే అంతే అంటూ కాకాణి అన్నారు అంటూ అసలు విషయం బయటపెట్టారు. జగన్ తో నడిస్తే భవిష్యత్ ఉండదని అన్న కాకాణి జగన్ ఒంటరిగా ఉన్నప్పుడు లేని కాకాణి ఇప్పుడు మాత్రం జగనే దేవుడు అంటున్నారని మంత్రి పదవి ఇచ్చినందుకు ఆమాత్రం భజన చేయాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. ఆనంను మోసం చేసింది కాకాణి కాదా? అంటూ ప్రశ్నించారు కోటంరెడ్డి.

Phone Tapping In YCP : నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్‌కౌంటర్ చేయండి : కోటంరెడ్డి

నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ వ్యవహారంలో కాకాణి పని త్వరలోనే ముగియనుందని..ఈ కేసులో అన్ని వేళ్లు కాకాణివైపే ఉన్నాయనే విషయం మర్చిపోవద్దంటూ ఎద్దేవా చేశారు. నేను వైసీపీలో ఉండి చంద్రబాబు కాళ్లకు దణ్ణం పెట్టలేదు. వైసీపీ నుంచి వెళ్లిపోదామని అన్ని విధాలుగా నిర్ణయం తీసుకున్నాకే టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానంటూ స్పష్టంచేశారు. పార్టీ నన్ను ఎన్నో రకాలుగా అవమానాలకు గురిచేసింది. అటువంటి పార్టీ నుంచి మౌనంగా వెళ్లిపోదామనుకున్నాను. కానీ నన్ను నానా విధాలుగా విమర్శలు చేస్తూ..బెదిరింపులకు పాల్పడుతున్నారని అందుకే సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు కోటంరెడ్డి.

Phone Tapping In YCP : ఒక్కడ్ని చేసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు.. : కోటం రెడ్డి

నాపై కిడ్నాప్ కేసు పెట్టారని కిడ్నాప్ కేసు కాదు మర్డర్ కేసులు పెట్టి బెదిరించినా నా నిర్ణయంలో మార్పు లేదన్నారు. నాకు ఫోన్లు చేసి బెదిరిస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయి జాగ్రత్త అంటూ కౌంటర్ ఇచ్చారు కోటంరెడ్డి. అలాగే తనపై విమర్శలు చేసి ఆరోపణలు చేసిన సజ్జలపై కూడా కోటంరెడ్డి విరుచుకుపడ్డారు. సజ్జల రాజకీయాలు చేయటం మానేసి పార్టీ నిలబడాలంటే ఆపరేషన్ నెల్లూరు రూరల్ పై దృష్టి పెట్టండి అంటూ ఎద్దేవా చేశారు.