Threatening Phone Call : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొలికల్ గేమ్ రోజు రోజుకు హీటెక్కుతుంది. కోటంరెడ్డి వర్సెస్ వైసీపీ నేతలుగా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది.

Threatening Phone Call : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్

MLA Kotamreddy

Threatening phone call : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొలికల్ గేమ్ రోజు రోజుకు హీటెక్కుతుంది. కోటంరెడ్డి వర్సెస్ వైసీపీ నేతలుగా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. సీఎం జగన్ ను, పార్టీ పెద్దలను విమర్శిస్తే బండికి కట్టుకుని వెళ్తామని బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి కోటంరెడ్డిని బెదిరిస్తూ ఫోన్ చేశాడు. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేదాయిపాలెం పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదైంది.

తనను ఫోన్ లో బెదించడంతోపాటు తన ఇంటి దగ్గరికి వచ్చి కిడ్నాప్ కు యత్నించారని కోటంరెడ్డిపై కార్పొరేటర్ విద్యాభాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీలను పెట్టి చంపిస్తవా అని కోటంరెడ్డిని విద్యా భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. కోటంరెడ్డి ప్లెక్సీలు చింపివేశారు. తాను జగన్ వెంటే నడుస్తానని కార్పొరేటర్ విద్యా భాస్కర్ రెడ్డి తేల్చి చెప్పారు.

Adala Prabhakar Reddy : ఆపరేషన్ నెల్లూరు.. కోటంరెడ్డికి జగన్ షాక్, నెల్లూరు రూరల్ ఇంచార్జ్‌గా ఆదాల

అదాల ప్రభాకర్ రెడ్డికి కార్పొరేటర్ విద్యా భాస్కర్ రెడ్డి మద్దతు తెలిపారు. మరోవైపు విమర్శల దాడితో వైసీపీ నేతలు కోటంరెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే కోటంరెడ్డి కూడా రియాక్ట్ అవుతున్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లలతో నెల్లూరు రాజకీయం ఆసక్తిగా మారుతుంది. ఏపీలో ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది.

తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనికి వెనకాల రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నేతలు హస్తమున్నట్లు పేర్కొన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను చెప్పినప్పటి నుంచి వైసీపీ నేతలు తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయిస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు.

MLA Kotamreddy Phone Tapping : సీఎం జగన్, సజ్జల ఆదేశాలు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఎన్నిసార్లు, ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా తాను నిజాలు మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్ కౌంటర్ చేయండి.. అంటూ కోటంరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా తన గొంతు ఆగదన్నారు.

అరెస్ట్ చేస్తానని బెదిరించటం కాదు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి అంటూ సవాల్ విసిరారు.  తనపై ఎన్ని కేసులు పెట్టినా బెదురుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రశ్నించేవారిని నిజాలు, మాట్లాడేవారిని అరెస్ట్ చేయించటం, అక్రమ కేసులు పెట్టటం అలవాటుగా మారినవారికి తనను అరెస్ట్ చేయటం పెద్ద విషయమే కాదన్నారు.