Phones Tapping In YCP : ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..బెదిరింపులకు భయపడేది లేదు : వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..బెదిరింపులకు భయపడేది లేదు అంటూ తేల్చి చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. తన ఫోనే కాదని మంత్రులు, 35మంది ఎంపీల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటూ సంచలన విషయాలు బయటపెట్టారు కోటంరెడ్డి.

Phones Tapping In YCP :  తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. కోటంరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ మరో ఎమ్మెల్యే బాలినేని స్పందిస్తు కేవలం పార్టీ మారటం కోసమే కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని అసలు ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం ప్రభుత్వానికి లేదని అన్నారు. కానీ కోటం రెడ్డి మాత్రం ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని అంత తేలిగ్గా వదలిలేలా లేరు. తన ఫోన్ ట్యాపింగ్ గురించి కేంద్రం హోమ్ శాఖకు ఫిర్యాదు చేస్తానంటూ మరో బాంబు పేల్చారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదని దీంట్లో ఐపీఎస్ ల పాత్ర ఉందని నేను సాక్ష్యాలు బయటపెడితే వారి ఉద్యోగాలు ఊడతాయని..కేంద్ర దర్యాప్తు అంటూ రచ్చ రచ్చ అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోటం రెడ్డి.

Andhra Pradesh : సాక్ష్యాలు బయటపెడితే ‘గవర్నమెంట్ షేక్ అవుతుంది’..ఐపీఎస్‌ల ఉద్యోగాలు ఊడుతాయ్ : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా తన వద్ద పక్కాగా సాక్ష్యాలున్నాయని వాటిని బయటపెడితే ప్రభుత్వం షేక్ అవుతుందని..కొంతమంది ఐఏఎస్ ల ఉద్యోగాలు ఊడుతాయి అంటూ వ్యాఖ్యానించిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విషయంపై కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు చేస్తానంటూ అధికార పార్టీ గుండెల్లో బాంబు పేల్చారు. నా ఫోన్ మాత్రమేకాదని కొంతమంది మంత్రులు, జడ్జీలు, అధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారంటూ పెను సంచలన వ్యాఖ్యలు చేశారు కోటంరెడ్డి.

Phone Tapping In YCP : వైసీపీలో హీట్ పుట్టిస్తోన్న ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. అధిష్టానంతో కోటంరెడ్డి రెడ్డి ఢీ అంటే ఢీ

తాను ఈ వ్యాఖ్యలు చేశాక కొంతమంది నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని కానీ ఎటువంటి బెదరింపులకు నేను భయపడేది లేదని కేంద్రానికి ఫిర్యాదు చేసిన తీరుతాను అంటూ కోటంరెడ్డి స్పష్టంచేశారు. తమ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయంటూ ఇద్దరు మంత్రులను తనకు చెప్పారని అన్నారు. అలా ఒకరు ఇద్దరు కాదని నలుగురు ఎంపీలు, 35మంది ఎంపీల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటూ సంచలన విషయాలు బయటపెట్టారు కోటంరెడ్డి. వైసీపీలో నాకు ఎన్నో అవమానాలు జరిగాయని వాపోయిన కోటం రెడ్డి వైఎస్ పై ఉన్న గౌరవంతోనే ఇంతకాలం అవమానాలను భరించాను ఇక నా వల్ల కాదు నమ్మకంలేని పార్టీలో ఉండలేను అంటూ కీలక నిర్ణయం తీసుకున్న ఆయన 2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేయటం  నెల్లూరు  వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది.

Andhra Paradesh Politics : YCPలో కోటంరెడ్డి కుంపటి..2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ బాంబు పేల్చిన నెల్లూరు నేత



ట్రెండింగ్ వార్తలు