Andhra Paradesh Politics : YCPలో కోటంరెడ్డి కుంపటి..2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ బాంబు పేల్చిన నెల్లూరు నేత
YCPలో కోటంరెడ్డి కుంపటి సెగలు పుట్టిస్తోంది. 2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ బాంబు పేల్చిన నెల్లూరు వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Andhra Paradesh Politics : వైనాట్ 175 అంటూ క్లీన్‌స్వీప్ లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తుంటే..తాజాగా నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రేపిన మంటలు సెగలు పుట్టిస్తున్నాయి. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నమ్మకంలేని చోట ఉండలేనన్న కోటం రెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ బాంబు పేల్చారు. అంటే టీడీపీలో ఆయన సిట్టింగ్ టికెట్ కన్ఫార్మ్ అయ్యిందా?అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కో వివాదం బయటకు రావడం.. ఫ్యాన్ పార్టీ నేతలను టెన్షన్ పెడుతోంది. అసమ్మతి రాగాలు ఓ వైపు.. వర్గవిభేదాలు మరోవైపు.. ఈ రెండింటి మధ్యలో సర్వేల టెన్షన్.. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి రాజేసిన కుంపటి ఫ్యాను చెమటలు పట్టిస్తోంది.
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయ్. ఎన్నిలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. పార్టీలన్నీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయాయ్. జనాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయ్ పార్టీలు ! లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే..బస్సుయాత్రకు పవన్ సిద్ధం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్‌ను.. వైసీపీలో వరుస పరిణామాలు ఇబ్బంది పెడుతున్నాయ్. పార్టీలో అసమ్మతి రాగాలు ఒకవైపు.. సర్వేలు అంటూ మరోవైపు.. ఇలా వరుస విషయాలు.. వైసీపీలో కొత్త టెన్షన్‌కు కారణం అవుతున్నాయ్. నెల్లూరులో నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి ఆనంను తప్పించిన కొద్దిరోజులకే.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం కొత్త చర్చకు కారణం అవుతోంది. అధిష్టానంపై ఆయన కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నారు. ఆఫీస్‌కు పిలిపించుకొని జగన్ స్వయంగా మాట్లాడినప్పటికీ ఆయనలో మార్పు కనిపించడం లేదు. పార్టీ మారేందుకు కోటంరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న వేళ… గడప గడపకు కార్యక్రమాన్ని కూడా ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని.. ఆధారాలు ఉన్నాయని అంటూ కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్.
అసంతృప్తులు మంటలు రేపుతుంటే.. మరోవైపు ఇండియాటుడే – సీ ఓటరు సర్వేలో.. సీఎం జగన్ వెనకబడినట్లు వచ్చిన రిపోర్టు వైసీపీలో కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా సీఎంల పాలనపై గత ఇండియాటుడే – సీ ఓటరు సర్వే చేసింది. ఇందులో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటిస్థానంలో ఉన్నారు. ఐతే గత రెండేళ్లలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న ఏపీ సీఎం జగన్.. ఈసారి మాత్రం పదవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఐప్యాక్ సర్వేలోనూ జగన్‌కు ప్రతికూల పవనాలు తప్పవని తేలిందంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం.. ఫ్యాన్ పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తోంది. ఈ సర్వేలు నిజమా కాదా అన్న సంగతి ఎలా ఉన్నా.. ఎన్నికల సమయంలో చీమ చిటుక్కుమన్నా.. ఆ ధ్వనికి అర్థం వేతికే పనిలో ఉంటారు. అలాంటిది ఓ వైపు సర్వేలు రేపుతున్న టెన్షన్.. మరోవైపు పెరుగుతున్న అసంతృప్త రాగాలు.. అధికార పార్టీలో కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. దీంట్లో భాగంగా కోటం రెడ్డి తేల్చి చెప్పేశారు 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని అందులోనే నెల్లూరు రూరల్ నుంచే పోటీలో ఉంటానని..మరి నెల్లూరు వైసీపీలో ఇంకా ఎటువంటి పరిణామాలు జరుగనున్నాయో..ఇంకెంతమంది కోటంరెడ్డి బాటలో నడువనున్నారోనని వైసీపీలో సెగలు పుట్టిస్తోంది.