Bhakarapeta Ghat Road : బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్ర్భాంతి…మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు

సీఎం జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందివ్వనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు చెల్లించాలని...

YS Jagan : చిత్తూరు జిల్లాలోని భాకరాపేట బస్సు ప్రమాద ఘటన అందర్నీ కలిచివేస్తోంది. నిశ్చితార్థానికి వెళ్లి.. అనంతలోకాలకు వెళ్లిపోయారు. సందడి సందడిగా కనిపించాలన్సి ఇళ్లు విషాదంతో మునిగిపోయాయి. కుటుంబసభ్యులు, బంధులమిత్రుల రోదనలతో ఆ ప్రాంతం మారుమోగుతోంది 50 అడుగుల లోతులో పడిపోయిన బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 8 మంది చనిపోగా.. 30 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని రుయా, స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి వేళ ప్రమాదం జరగడంతో బాహ్య ప్రపంచానికి ఆలస్యంగా తెలిసింది. స్పాట్ లోనే ఏడుగురు చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

Read More : Bhakarapeta Ghat Road : లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి, చంద్రబాబు దిగ్ర్భాంతి

ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రమాదం విషయం తెలుసుకున్న సీఎం జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందివ్వనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు చెల్లించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య విషయంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. బాధితులు కోలుకొనేంత వరకు అండగా ఉండాలని ఆదేశాలిచ్చారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది ? ఘటన అనంతరం చేపట్టిన సహాయక చర్యలను సీఎంకు అధికారులు వివరించారు.

Read More : Chittoor : నిశ్చితార్థం సంబరాల్లో విషాదం.. 50 అడుగుల లోతులో పడిన బస్సు, మృతుల వివరాలు

చిత్తూరు జిల్లాలోని భాకరాపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. స్పాట్ లోనే ఏడుగురు చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ప్రమాదంలో 33 మందికి తీవ్రగాయాలయ్యాయి. కొందరిని రుయా, మరికొందరిని స్విమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భాకరాపేట ఘాట్ రోడ్డులో 2022, మార్చి 26వ తేదీ శనివారం రాత్రి పెళ్లి బస్సు బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 50 అడుగుల లోయలో ప్రైవేటు బస్సు పడిపోయింది. ధర్మవరం నుంచి తిరుపతిలో నిశ్చితార్థానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 50 మంది ఉన్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు