Bhakarapeta Ghat Road : లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి, చంద్రబాబు దిగ్ర్భాంతి

భాకరాపేట ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పెళ్లింటే జరిగిన ప్రమాదం ఆ కుటుంబాల్లో

Bhakarapeta Ghat Road : లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి, చంద్రబాబు దిగ్ర్భాంతి

Bus Accidnet Babu

Bus Rollover At Bhakarapeta Ghat Road : చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. స్పాట్ లోనే ఏడుగురు చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ప్రమాదంలో 33 మందికి తీవ్రగాయాలయ్యాయి. కొందరిని రుయా, మరికొందరిని స్విమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భాకరాపేట ఘాట్ రోడ్డులో 2022, మార్చి 26వ తేదీ శనివారం రాత్రి పెళ్లి బస్సు బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 50 అడుగుల లోయలో ప్రైవేటు బస్సు పడిపోయింది. ధర్మవరం నుంచి తిరుపతిలో నిశ్చితార్థానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 50 మంది ఉన్నట్లు సమాచారం.

Read More : Chittoor : నిశ్చితార్థం సంబరాల్లో విషాదం.. 50 అడుగుల లోతులో పడిన బస్సు, మృతుల వివరాలు

భాకరాపేట ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పెళ్లింటే జరిగిన ప్రమాదం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు, లోయలో బస్సు బోల్తా పడి 8 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు.

Read More : Chittoor : చిత్తూరులో పెళ్లి బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. 2022, మార్చి 26వ తేదీ శనివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీంతో ధర్మవరం నుంచి మధ్యాహ్నం ప్రైవేటు బస్సులో సుమారు 50 మందితో బయలుదేరారు. దొనకటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపు వద్ద బస్సు అమాంతం అదుపు తప్పింది. సుమారు 50 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. అసలు ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా పెద్ద పెట్టున రోదించారు. ఒకరిపై ఒకరు పడి కాళ్లు చేతులు విరగడం.. తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. చిమ్మచీకటి కావడంతో ప్రమాద విషయం ఆలస్యంగా తెలిసింది. ఏడుగురు స్పాట్ లోనే చనిపోయారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రగాయాలైన వారిని రుయా, స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరొకరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయారు. మృతుల్లో ఓ మహిళ, చిన్నారి ఉన్నారు.

మృతి చెందిన వారి వివరాలు : డ్రైవర్ నభి రసూల్, మల్లిశెట్టి వెంగప్ప, మల్లిశెట్టి గణేశ్, కాంతమ్మ, మల్లిశెట్టి మురళి, జె.యశస్విని, క్లీనర్.