Chittoor : చిత్తూరులో పెళ్లి బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది...

Chittoor : చిత్తూరులో పెళ్లి బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

Road Accident

Bus Accident At Bhakarapet Ghat Road : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతిచెందగా…ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు విడిచారు. ఇక మరికొందరికి గాయాలు అయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి వెళుతుండగా ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపు ఈ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో పెళ్లి కుమారుడితో పాటు మిగతా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలించారు.

Read More : Chittoor Bus Accident : చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ పెళ్లి బస్సు, 10మంది మృతి

అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. 2022, మార్చి 26వ తేదీ శనివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేణు కుటుంబం ధర్మవరం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరింది. చిత్తూరు జిల్లా పీలేరులో రాత్రి 8 గంటల సమయంలో ఓ దాబా వద్ద అందరూ భోజనాలు చేశారు. ఆపై 9 కిలోమీటర్లు ప్రయాణించి భాకరాపేట ఘాట్‌లో వస్తుండగా దొనకోటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపులో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవరు అతి వేగంగా నడపటంతో మలుపువద్ద అదుపు తప్పి కుడివైపున లోయలోకి బస్సు దూసుకెళ్లింది. బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా పెద్ద పెట్టున రోదించారు. ఒకరిపై ఒకరు పడి కాళ్లు చేతులు విరగడం.. తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది.

Read More : Ambati On Chandrababu : 29న చంద్రబాబు అరాచకాలను బయటపెడతాం-అంబటి రాంబాబు

తిరుపతి రుయాలో క్షతగాత్రులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరామర్శించారు. ఘాట్‌ రోడ్డు కావడంతో ప్రమాదం జరిగిన విషయం రాత్రి 10.30 గంటల వరకు వెలుగు చూడలేదు. క్షతగాత్రుల హాహాకారాలతో అటుగా వెళ్లేవారు ఆగి లోయలోకి దిగి చూశారు. అక్కడ బస్సు పడి ఉండటం, క్షతగాత్రులు చెల్లాచెదురై రోదిస్తుండటాన్ని గమనించి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్‌ ఎం.హరినారాయణన్, తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఘటనాస్థలానికి చేరుకొని, సహాయక చర్యల్లో పాల్గొన్నారు.