Ambati On Chandrababu : 29న చంద్రబాబు అరాచకాలను బయటపెడతాం-అంబటి రాంబాబు

ఎన్టీఆర్ పార్టీని, గుర్తుని, ట్రస్టుని, కుర్చీని లాక్కున్న వైనం పట్ల.. చంద్రబాబు చేసిన విధ్వంసం పట్ల వాడవాడలా చర్చ జరగాలి.(Ambati On Chandrababu)

Ambati On Chandrababu : 29న చంద్రబాబు అరాచకాలను బయటపెడతాం-అంబటి రాంబాబు

Ambati On Chandrababu

Ambati On Chandrababu : ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ గా రాజకీయం నడుస్తోంది. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, సవాళ్లు సంధించుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. ఇప్పటికే ఏపీలో మద్యం బ్రాండ్ల వార్ నడుస్తోంది. ఈ విషయంలో ఇరు పక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. అటు వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. తాజాగా చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదన్నారు. అంతేకాదు ఈ నెల 29న చంద్రబాబు అరాచకాలను బయటపెడతామన్నారు.

”ఈ నెల 29వ తేదీన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు అరాచకాలను బయట పెడతాం. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక చంద్రబాబు పనికి మాలిన విమర్శలు చేస్తున్నారు. వైపీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మంచితో పాటు.. చంద్రబాబు హయాంలో జరిగిన దారుణాల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. జగన్ పాలనలో 34 నెలల్లోనే ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీ పాలనలో ఏం అభివృద్ధి జరిగింది?” అని అంబటి ప్రశ్నించారు.(Ambati On Chandrababu)

AP Finance : రూ. 48 వేల కోట్ల దుర్వినియోగం.. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలి – యనమల

”ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటిది తెలుగు దేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ఇప్పుడు నడుపుతున్నది తెలుగు దేశం పార్టీ కాదు తెగులు దేశం పార్టీ. ఈ తెగులు దేశం తెలుగు రాష్ట్రాలకు పట్టినటువంటి తెగులు. కాబట్టి తెలుగు దేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు. రాష్ట్రవ్యాప్తంగా 29న పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ పార్టీని, ఎన్టీఆర్ గుర్తుని, ఎన్టీఆర్ ట్రస్టుని, ఎన్టీఆర్ కుర్చీని లాక్కున్న వైనం పట్ల, చంద్రబాబు చేసిన విధ్వంసం పట్ల వాడవాడలా 29వ తేదీన చర్చ జరగాల్సిన అవసరం ఉంది” అని అంబటి రాంబాబు అన్నారు.

వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు అంబటి రాంబాబు. బహిరంగ చర్చకు చంద్రబాబు రాకపోయినా.. నారా లోకేశ్‌ను పంపించినా పర్వాలేదన్నారు. తమ ప్రభుత్వ స్థాయి వ్యక్తి కాకపోయినా.. లోకేశ్‌తో కూడా చర్చకు సిద్ధమని చెప్పారు. రాష్ట్రంలో ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభమవుతుందని అంబటి రాంబాబు తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని స్పష్టంచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రమే అమరావతి రాజధాని కావాలని అంటున్నారని అన్నారు.

Andhra Pradesh : ఈనెల 29న కొత్త జిల్లాలకు తుదిరూపు ?

”ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాలు ఉంటాయి. ఆ రోజు నుంచే పరిపాలన ప్రారంభం అవుతుంది. 40 ఏళ్ల టీడీపీ చరిత్రతో పాటు 34 నెలల జగన్‌ పరిపాలనపై చర్చ జరగాలి. వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేసిన విధానాలపై చర్చ జరగాలి. బీసీలకు టీడీపీ హయాంలో జరిగిన అన్యాయంపై చర్చ జరగాలి. ఈ నెల 29 నుంచి చంద్రబాబు అరాచకాలను వివరిస్తాం. చంద్రబాబు ఒక్క పరిపాలనా సంస్కరణ అయినా చేశారా..?”అని అంబాటి ప్రశ్నించారు.