AP Finance : రూ. 48 వేల కోట్ల దుర్వినియోగం.. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలి – యనమల

రూ. 48 వేల కోట్ల రూపాయలు లెక్కల విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ డబ్బంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని యనమల ఆరోపణలు చేశారు...

AP Finance : రూ. 48 వేల కోట్ల దుర్వినియోగం.. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలి – యనమల

Ap (1)

Yanamala Comments : ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సంచలన ఆరోపణలు గుప్పిస్తోంది. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రశ్నిస్తోంది. ఆదాయానికి మించి అప్పులు తీసుకొస్తుండడంతో ఏపీ ప్రభుత్వం సమస్యల్లో కొట్టుమిట్టాడుతోందని విమర్శలు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని పేర్కొంటూ… టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదుట నిరసన సైతం తెలిపారు.

Read More : Visakha Railway Zone: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ప్రభుత్వానికి ఆర్థిక క్రమ శిక్షణ కొరవిడిందని, వాస్తవాలకు విరుద్ధంగా సీఎం జగన్ మాట్లాడుతున్నారంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. కేంద్రం నుంచి రావల్సిన నిధులు..ఇతరత్రా అంశాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అప్పులు చేస్తోందంటూ దుయ్యబడుతున్నారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉందని, శ్రీలంక ఆర్థిక పరిస్థితి కంటే ఘోరంగా ఉందని.. త్వరలోనే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతితెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ఆర్థిక పరిస్థితిపై హాట్ హాట్ చర్చలు కొనసాగుతున్న క్రమంలో..ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, టీడీపీ హాయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడు సైతం సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

Read More : TDP Special Logo : 40 వసంతాల తెలుగుదేశం.. ప్రత్యేక లోగో ఆవిష్కరణ

రూ. 48 వేల కోట్ల రూపాయలు లెక్కల విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ డబ్బంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని 2022, మార్చి 26వ తేదీ శనివారం యనమల ఆరోపణలు చేశారు. రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డబ్బు ఎలా ఖర్చు పెట్టారంటే.. స్పెషల్ బిల్లుల పేరిట ఖర్చు పెట్టడం జరిగిందని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఒకవేళ ప్రజల కోసం ఖర్చు పెడితే ఆ విషయాలని సీఎం జగన్ ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని సూటిగా ప్రశ్నించారు యనమల. నిధుల దుర్వినియోగం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఏపీ విషయంలో కేంద్రం ఆర్టికల్ 360 అమలు చేయాలని కోరారు. ఏపీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని మరోసారి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని యనమల విజ్ఞప్తి చేశారు.