Visakha Railway Zone: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకూ..వాల్తేర్ డివిజన్ స్థానంలో స్థానంలో కొత్తగా రాయగఢ డివిజన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిందని వివరించారు

Visakha Railway Zone: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Visakha

Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం పార్లమెంటు సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ రైల్వే జోన్ అంశంపై స్పష్టత ఇవ్వాలని సభా ముఖంగా ప్రశ్నించారు. ఈమేరకు స్పందించిన రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్..విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకూ..వాల్తేర్ డివిజన్ స్థానంలో స్థానంలో కొత్తగా రాయగఢ డివిజన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిందని వివరించారు. రైల్వే జోన్ ఏర్పాటుపై చేపట్టిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(DPR) సమర్పించిన అనంతరం దక్షిణ కోస్తా రైల్వేజోన్, రాయగఢ రైల్వే డివిజన్ పరిధులు, ఇతర అంశాలపై కొన్ని సలహాలు సూచనలు వచ్చాయని.. వీటిపై మరింత లోతుగా విశ్లేషించేందుకు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Also Read:Petrol Diesel Prices : దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో నాలుగోసారి

కొత్త రైల్వేజోన్, రైల్వే డివిజన్ కోసం ఇప్పటికే 2020-21 కేంద్ర బడ్జెట్ లో రూ.170 కోట్ల నిధులు కేటాయించినట్లు రైల్వేశాఖ మంత్రి పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌లో ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే భూమిని ఎంపిక చేసినట్లు తెలిపిన మంత్రి.. ఆమేరకు అవసరమైన భూసర్వే, ప్రధాన కార్యాలయ సముదాయం లేఅవుట్‌, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణ పనుల ప్రాథమిక కార్యకలాపాలను చేపట్టాలని రైల్వేశాఖ ప్రత్యేకాధికారికి నిర్దేశించినట్లు తెలిపారు. ఇక కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ నిధుల కేటాయింపుపై ఎంపీ టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బదులిస్తూ..కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కోసం 2013-14 మధ్య కేటాయించిన రూ.110 కోట్ల నిధులను.. ప్రస్తుతం రూ.560.72 కోట్లకు పెంచినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.171.2 కోట్లు ఖర్చుచేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Also read:IICT Science Meeting: ఐఐసీటీలో నేటి నుంచి “విజన్ ఇండియా 2047” సమావేశాలు