YS Jagan
YS Jagan: ఏపీ పాలిటిక్స్ మరోసారి ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ..వైసీపీ అధినేత జగన్..ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణకు సపోర్ట్ చేయడం చర్చకు దారి తీసింది. ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఆల్రెడీ కేంద్రంలో ఎన్డీయేలో భాగం. వాళ్ల సపోర్ట్ ఆటోమేటిక్‌గా ఎన్డీయే క్యాండిడేట్‌కు ఉంటుంది. ఇక జగన్ కూడా ఎన్డీయేకు మద్దతు తెలపడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జగన్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా స్తబ్ధతగా ఉంటారన్న అందరూ ఊహించారు.
మోదీ, అమిత్‌షాతో జగన్‌కు ఉన్న బంధంపై అవగాహన ఉన్నవారైతే జగన్ సపోర్ట్ ఎన్డీయేకే అని ఫిక్స్ అయిపోయారు. వాళ్లంతా అనుకున్నదే నిజం అయింది. బీజేపీ బలపర్చిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌కే జగన్ జై కొట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు 2022లో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. అప్పుడు వైసీపీ ఎన్డీయేకే మద్దతు ఇచ్చింది.
Also Read: IndiGo: విమానాల్లో కొబ్బరికాయను తీసుకెళ్లవచ్చా? నిషేధం ఉంటుందా?
ఆనాడు ఎన్డీయే కూటమిలో లేని తెలుగుదేశం కూడా అప్పుడు రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు తమ సపోర్టు చేసింది. అలా మొత్తం ఓట్లు బీజేపీకే వెళ్ళాయి. అప్పుడు వైసీపీ టీడీపీ మీద కొంత రుసరుసలాడింది. అయినా కూడా ఇద్దరూ కలసి జైబీజేపీ అనేశారు. కట్ చేస్తే నేడు విపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఎన్డీయేకు సై అంటోంది.
ఈ పరిణామాలన్నింటినీ అబ్జర్వ్ చేస్తే ఏపీ పాలిటిక్స్ కేంద్రంలోని బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయట. బీజేపీకి ఏపీలో పెద్దగా రాజకీయ బలం లేదు.
కానీ ఏపీలో ఏ పార్టీ పవర్‌లో ఉన్నా..కీలక సమయాల్లో, కీలక బిల్లుల విషయంలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఏపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు ఎన్డీయేకే దక్కుతుంది. ఇప్పుడు అనూహ్యంగా ఒక ఛాన్స్ వైసీపీకి ఉప రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది.
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేరుగా జగన్‌కే ఫోన్ చేసి వైసీపీ నుంచి మద్దతు అడిగారు. (YS Jagan)
దానికి వైసీపీ సైతం సానుకూలంగానే స్పందించింది. అయితే ఈ మద్దతు బీజేపీకి ఇష్టంగా..టీడీపీకి అంతగా నచ్చకపోవచ్చు. అయితే బీజేపీ ఆడుతోన్న పొలిటికల్ గేమ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటోంది. ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా..ఎవరు అపోజిషన్ ఉన్నా ఎవరికి వన్ సైడ్‌గా సపోర్ట్ చేయడం లేదు. ఎటువైపు మొగ్గకుండా ఉండాలన్నదే బీజేపీ పొలిటికల్ గేమ్ అంటున్నారు.
ఏదో ఒకవైపే ఉంటే రాజకీయ అవసరాలున్నప్పుడు బీజేపీకి ఇబ్బందిగా మారొచ్చు. అందుకే బ్యాలెన్స్‌గా దూరపు చూపుతో ఆ పార్టీ వ్యవహరిస్తుందన్న టాక్ ఉంది.
ఏపీలోని ప్రాంతీయ పార్టీలనే కాదు, దేశంలోని తటస్థ పార్టీలను బీజేపీ తమ వైపు తిప్పుకోవడం వెనక.. కాంగ్రెస్‌ను ఎదగనీయకుండా చేసే స్కెచ్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ పార్టీలను వదిలేస్తే కాంగ్రెస్‌కు పరోక్షంగా అయినా మేలు జరుగుతుందన్నది కమలనాథుల అంచనా.
అయితే ఏపీలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కూటమి, వైసీపీ మధ్య రాజకీయం నెక్స్ట్ లెవల్ హీట్‌ను క్రియేట్ చేస్తోంది. సరిగ్గా ఇదే టైమ్‌లో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల వచ్చాయి.
వైసీపీ ఎన్డీయేకు సపోర్ట్ చేయడం వెనక రీజన్ ఏంటని అడిగితే వైసీపీ చెప్తున్న ఆన్సర్ వెరీ సింపుల్. తమ అధినేతను జైలులో పెట్టిన పార్టీతో ఎప్పుడూ చేతులు కలపబోమంటోంది.
ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ హడావుడి చేస్తూ కూడా ఏపీ ప్రస్తావనే తేలేదని తప్పుబడుతోంది వైసీపీ. అంతేకాదు రాహుల్, చంద్రబాబుకు మధ్య హాట్ లైన్ నడుస్తోందని సంచలన వ్యాఖ్యలే చేశారు జగన్.
ఈ లెక్కన తాము ఇండియా కూటమి వైపు కాదని ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందే జగన్ అండ్ టీమ్ క్లారిటీ ఇచ్చేసినట్లు అయింది. అయితే జాతీయ స్థాయిలో వైసీపీ పదేపదే ఎన్డీఏకు బేషరతుగా మద్దతు ఇవ్వడం అనేక రకాల చర్చకు దారితీస్తోంది.
ఏపీ వరకూ వస్తే మాత్రం వైసీపీ అధినాయకత్వం ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి ఎన్నికలు వస్తే బీజేపీకే మద్దతు ఇస్తుంది. ఏపీకి బీజేపీ నేతలు జగన్‌ను గట్టిగానే విమర్శిస్తుంటారు.
జాతీయ స్థాయి నాయకులు మాత్రం జగన్ పేరు ఎత్తరు. ఒకవేళ విమర్శించిన లైటర్ వేలోనే టచ్మీ నాట్ అన్నట్లుగా మాట్లాడేస్తుంటారు. ఇది కూడా ఎన్నో రకాలైన చర్చలకు తావిస్తోంది. ఏదైనా ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వైసీపీ మరోసారి ఎన్డీయేకు సపోర్ట్ చేయడం మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.