Jagan Helicopter Issue: 3 గంటలు, 100 ప్రశ్నలు.. జగన్ హెలికాప్టర్ వివాదం, కో పైలట్‌ని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు..

ఏ నిబంధన ప్రకారం అలా వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు.

Jagan Helicopter Issue: 3 గంటలు, 100 ప్రశ్నలు.. జగన్ హెలికాప్టర్ వివాదం, కో పైలట్‌ని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు..

Updated On : April 16, 2025 / 7:06 PM IST

Jagan Helicopter Issue: శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ హెలికాప్టర్ వివాదం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో సీకే పల్లి పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ అంశంలో కో పైలట్ ని సుదీర్ఘంగా విచారించారు సీకేపల్లి పోలీసులు. సుమారు 3 గంటల పాటు ఎంక్వైరీ చేశారు. కో పైలట్ ని 100 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. కుట్రకోణం గురించి లోతుగా ఆరా తీశారు పోలీసులు.

Also Read : ఎన్నికల్లో వైసీపీ ఓటమికి మాజీమంత్రి ప్లాన్? సిట్టింగ్ ఎమ్మెల్యేపై కుట్రలు? ఎవరా నేత, ఎందుకిలా..

టూవే బుకింగ్ చేసుకున్న సమయంలో హెలికాప్టర్ ను అర్ధాంతరంగా ఎందుకు ఫ్లై చేశారున్న యాంగిల్ లో పోలీసులు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. రేపు పైలట్ అనిల్ కుమార్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. పైలట్ అనిల్ కుమార్ తో పాటు థర్డ్ పార్టీ టికెటింగ్ ఏజెన్సీ చిప్పన్ ఏవియేషన్ కంపెనీకి కూడా పోలీసులు నోటీసులిచ్చే అవకాశం ఉంది. జనాల వల్ల హెలికాప్టర్ దెబ్బతిందా? లేక వేరే కారణాలు ఉన్నాయా? అని అడిగినట్టు సమాచారం.

Also Read : జనసేనలో చేరతారా, బీజేపీలోకి వెళ్తారా? ఎటూ తేల్చుకోలేకపోతున్న గ్రంథి.. కారణం అదేనా..

ఏ నిబంధన ప్రకారం అలా వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు. MEL లిస్ట్ ప్రకారం వెళ్లినట్లు పోలీసులకు సమాధానం ఇచ్చాడు కో పైలట్. ప్యాసింజర్ సైడ్ విండో క్రాక్ ఇవ్వడంపైనా పోలీసులు ఆరా తీశారు. జనాల వల్లే ఇబ్బంది తలెత్తిందని కో పైలెట్ పోలీసులతో చెప్పినట్టు సమాచారం. హెలికాప్టర్ గోదావథ్ సంస్థకు చెందినదిగా నిర్ధారించారు పోలీసులు. కో పైలట్ విచారణ మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు పోలీసులు. ప్రధాన పైలట్ అనిల్ కుమార్ విచారణకు వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here