YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి..

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.

YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి..

Jagan Palnadu district tour

Updated On : June 18, 2025 / 1:33 PM IST

YS Jagan Palnadu district tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. జగన్ పర్యటన సందర్భంగా గుంటూరులో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఏటుకూరు సమీపంలోని లాల్‌పురం హైవేపై జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణించాడు.

 

మృతుడిని వెంగలయపాలెంకు చెందిన సింగయ్యగా గుర్తించారు. మరోవైపు.. సింగయ్య మృతిపై టీడీపీ స్పందించింది. జగన్ రెడ్డి ప్రచారం పిచ్చికి మరొకరు బలయ్యారు అంటూ.. గాయపడి కిందపడిన వ్యక్తికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో  పోస్టు చేసింది.