Ys Sharmila Daughter Marriage : వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. కాబోయే అల్లుడిని పరిచయం చేసిన షర్మిల
Ys Sharmila Daughter Marriage : బ్రదర్ అనిల్ కుమార్ - వైఎస్ షర్మిల దంపతుల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చమైంది.
Ys Sharmila Daughter Marriage
Ys Sharmila Daughter Marriage : దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెండ్లి సందడి నెలకొంది. బ్రదర్ అనిల్ కుమార్ – షర్మిల దంపతుల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం త్వరలోనే జరగబోతోంది. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు.. తన కుమార్తెతో పాటు కాబోయే అల్లుడి ఫొటోను కూడా షర్మిల షేర్ చేశారు. ఈ శుభవార్తను రాష్ట్ర ప్రజలతో పంచుకోవడం ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు.
Also Read : Singer Jhansi : చీరకట్టులో బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్.. సింగర్ ఝాన్సీ ఫోటోలు వైరల్..
షర్మిల ట్వీట్ ప్రకారం.. మా కుమార్తె వై.ఎస్. అంజలి రెడ్డికి సోమల సుబ్బారెడ్డి- సోమల పద్మారెడ్డి దంపతుల కుమారుడైన డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో వివాహం నిశ్చయమైంది. ఈ శుభవార్తను తెలియజేయడానికి నా భర్త అనిల్ కుమార్, నేను దేవునికి ఎంతో కృతజ్ఞతతో సంతోషిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులందరూ అమెరికా పౌరులు. వారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందినవారు. మా స్నేహితులు, శ్రేయోభిలాషులందరి ప్రార్థనలు, ఆశీస్సులు కోరుకుంటున్నాము. అని షర్మిల పేర్కొన్నారు.
My husband, Anil Kumar, and I are very grateful to God and delighted to share the wonderful news that our daughter, Y.S. Anjili Reddy’s marriage has been arranged with Dr. Somala Raghuram Reddy, son of Sri Somala Subba Reddy and Smt. Somala Padma Reddy.
All members of their… pic.twitter.com/50NEQkqT08— YS Sharmila (@realyssharmila) September 6, 2026
