YSR Jayanthi 2024 : ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్‌మోహన్ రెడ్డి, విజయమ్మ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటు వద్ద ...

Jaganmohan Reddy Tribute at YSR Ghat
YS Jaganmohan Reddy Tribute at YSR Ghat : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటు వద్ద వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సోమవారం ఉదయాన్నే జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, మాజీ మంత్రి ఉషశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రఘురాం రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Also Read : కరెంట్ వైర్లతో జాగ్రత్త, లేదంటే ప్రాణాలకే ప్రమాదం.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..
భారీ సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ శ్రేణులు ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి వారికి అభివాదం చేస్తూ, అందరిని ఆప్యాయంగా పలుకరించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మ కంటతడి పెట్టారు. జగన్ మోహన్ రెడ్డిని ఆప్యాయంగా హత్తుకొని కన్నీటి పర్యాంతమయ్యారు. జగన్ తల్లి విజయమ్మను ఓదార్చారు.
Also Read : 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూలో మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు
చిన్నారికి పేరుపెట్టిన జగన్..
వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన కార్యకర్త బిడ్డకు జగన్ మోహన్ రెడ్డి పేరుపెట్టారు. మూడు నెలల చిన్నారికి తన తల్లి పేరు కలిసి వచ్చేలా విజయశ్రీ అని నామకరణం చేశారు. అనంతరం పాప తండ్రి మాట్లాడుతూ.. తన రెండోసంతానంగా ఆడబిడ్డ పుట్టిందని, పేరు పెట్టమని జగన్ మోహన్ రెడ్డిని కోరానని, విజయశ్రీ అని తన బిడ్డకు నామకరణం చేశారని పాప తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు.