MLC Iqbal: బాలకృష్ణ సీఎం జగన్ అపాయింట్‌మెంటే అడగలేదు -ఎమ్మెల్సీ ఇక్బాల్

బాలకృష్ణ ఇప్పటివరకు ఒక్కసారికూడా అసెంబ్లీకి రాలేదని, కావాలంటే రికార్డులు పరిశీలించాలని విమర్శించారు హిందూపురం వైసీపీ నాయకులు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.

MLC Iqbal: బాలకృష్ణ సీఎం జగన్ అపాయింట్‌మెంటే అడగలేదు -ఎమ్మెల్సీ ఇక్బాల్

Iqbal

Updated On : February 4, 2022 / 6:42 PM IST

MLC Iqbal: బాలకృష్ణ ఇప్పటివరకు ఒక్కసారికూడా అసెంబ్లీకి రాలేదని, కావాలంటే రికార్డులు పరిశీలించాలని విమర్శించారు హిందూపురం వైసీపీ నాయకులు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.

హిందూపురంని జిల్లా చేయటానికి అన్ని అర్హతలు ఉన్నాయని మేము కూడా చెబుతూనే ఉన్నామని, అయితే, సత్యసాయి బాబా అనంతపురం జిల్లాకి ఎనలేని సేవలు చేశారని, బాబా సేవలను గుర్తించి పుట్టపర్తిని జిల్లాగా ప్రకటించి ఉండొచ్చు అని అన్నారు.

బాలకృష్ణ తీరు ఏలా ఉందంటే జిల్లాలు ప్రకటన వచ్చిన వెంటనే రాజకీయ లబ్ది కోసం ఓ వీడియో రిలీజ్ చేశారు. బాలకృష్ణ ఒక్కసారి కూడా జగన్ మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ అడగలేదు. ఊరికే ముఖ్యమంత్రికి లేఖ రాశా అపాయింట్‌మెంట్ అడిగా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు అని అన్నారు ఇక్బాల్.

మీరూ మీ బావ చంద్రబాబు రాయలసీమ ద్రోహులు అని దుయ్యబట్టారు. ఆహా షోలో పద్యాలు ఇక్కడికి వచ్చి వినిపిస్తున్నారు అని అన్నారు. బాలకృష్ణ రాజీనామా చేస్తా అంటున్నారు. రాజీనామా చేసి రండి ప్రజాక్షేత్రంలో పోరాడుదాం ప్రజలు ఎవరికి మద్దతిస్తారో తేలిపోద్ది కదా? అని అన్నారు.

బాలకృష్ణకు అఖండ మీద.. బోయపాటి శీను మీద.. కూమారుడు మోక్షఙ్ఞ కేరీర్ మీద దృష్టి తప్ప హిందూపురం మీద లేదని అన్నారు. మీరు అఖండ అయితే నేను ప్రక్షండా.. ఇక్కడెవ్వరు బయపడరు అని అన్నారు.