వైసీపీ ఫోన్లు ట్యాపింగ్:  హైకోర్టులో విచారణ ప్రారంభం

  • Publish Date - March 27, 2019 / 09:49 AM IST

అమరావతి:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో సహ  దాదాపు 65 మంది వైసీపీ నేతల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్  పిటీషన్ దాఖలు చేశారు  వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పిటీషన్ లో 13  మందిని ప్రతి వాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారు. దీనితో పాటు కీలక ఆధారాలను కూడా పిటీషనర్ హై కోర్టుకు సమర్పించారు.
Read Also : బాబు మళ్లీ సీఎం అయితే రద్దయ్యేవి ఇవే – జగన్

కేసులో ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిజిపి,ఇంటిలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వరరావు, కౌంటర్ ఇంటిలిజెన్స్ ఎస్పీ భాస్కర్ భూషణ్ తో పాటు కేంద్ర,రాష్ట్ర  ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా చేర్చారు.  పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని గతంలోనే ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటంతో  ఈ రోజు హై కోర్టులో పిటీషన్ వేయాల్సి వచ్చింది అని పిటీషనర్ పేర్కోన్నారు. పిటీషన్ ను స్వీకరించిన హై కోర్టులో బుధవారం మధ్యాహ్నం వాదనలు  ప్రారంభమయ్యాయి.  
Read Also : జగన్ కూడా రెడీ.. కేసీఆర్‌ను ఢిల్లీకి పంపిద్దాం : కేటీఆర్