Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే?

లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఆయన ఉన్నారు.

Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే?

YCP MP Mithun Reddy

Updated On : September 29, 2025 / 3:28 PM IST

Mithun Reddy: ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. వారంలో రెండుసార్లు సంతకాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఆయన ఉన్నారు. రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులకు గుడ్‌న్యూస్.. రూ.104కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల

మిథున్‌ రెడ్డి జులై 19న అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మధ్యలో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ దక్కింది. ఆ గడువు ముగిశాక మళ్లీ జైలుకు వెళ్లారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

ఏప్రిల్‌ 19న మిథున్‌ రెడ్డి తొలిసారి సిట్‌ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన దర్యాప్తు అధికారులకు సహకరించలేదని వార్తలు వచ్చాయి. దీంతో మిథున్‌ రెడ్డిని ఏ4గా చేర్చారు.

మిథున్ రెడ్డి చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను అప్పట్లో ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లినప్పటికీ అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. చివరకు మిథున్ రెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. జులై 19న అరెస్ట్ అయ్యారు.