Telangana Govt : తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులకు గుడ్‌న్యూస్.. రూ.104కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ కార్యదర్శులకు భారీ శుభవార్త చెప్పింది.

Telangana Govt
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ వేళ పంచాయతీ కార్యదర్శులకు భారీ శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న రూ.104 కోట్ల బిల్లులను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఏకకాలంలో పెద్దమొత్తంలో పెండింగ్ బిల్లులను విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కలకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఈ నిధులు పంచాయతీ కార్యదర్శుల ఖాతాల్లో జమకానున్నాయి.