local body election : తెలంగాణలో మోగిన స్థానిక ఎన్నికల నగారా.. ఐదు దశల్లో ఎన్నికలు.. మొదట జడ్పీటీసీ, ఎంపీటీసీ పోరు.. తేదీలు ఇవే..
local body election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల తేదీలను వివరించాలరు.

Telangana State Election Commission
local body election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (ఎస్ఈసీ) రాణికుముదిని ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు.
పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎన్నికలు మొత్తం ఐదు దశల్లో జరగనున్నాయి. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఆ తరువాత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిని మూడు దశల్లో నిర్వహించనున్నారు.
మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168. అందులో పురుష ఓటర్లు 81,65,894కాగా.. మహిళా ఓటర్లు 85,36,770, ఇతరులు – 504 మంది ఉన్నారు.
మొదటి దశ (ఎంపీటీసీ, జెడ్పీటీసీలు)
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 9
పోలింగ్ తేదీ – అక్టోబర్ 23
కౌంటింగ్ తేదీ – నవంబర్ 11
రెండో దశ (ఎంపీటీసీ, జెడ్పీటీసీలు)
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 13
పోలింగ్ తేదీ – అక్టోబర్ 27
కౌంటింగ్ తేదీ – నవంబర్ 11
మూడో దశ (గ్రామపంచాయతీలు, వార్డులు)
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 17
పోలింగ్ తేదీ – అక్టోబర్ 31
కౌంటింగ్ తేదీ – అక్టోబర్ 31
నాలుగో దశ (గ్రామపంచాయతీలు, వార్డులు)
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 21
పోలింగ్ తేదీ – నవంబర్ 4
కౌంటింగ్ తేదీ – నవంబర్ 4
ఐదో దశ (గ్రామపంచాయతీలు, వార్డులు)
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 25
పోలింగ్ తేదీ – నవంబర్ 8
కౌంటింగ్ తేదీ – నవంబర్ 8