Astrological remedies
Astro Tips : ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన ఉద్యోగం కావాలని కోరుకుంటారు. కొంతమంది చాలా కష్టపడతారు కూడా. చాలా సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటారు. కానీ, గ్రహాల అశుభ ప్రభావాలు, కొన్ని గ్రహాల కలయికల కారణంగా వారు ఎంతగా కష్టపడినా ఫలితం ఉండదు.
ఎంతగా ప్రయత్నించినా వచ్చినట్టే ఉద్యోగం వచ్చి చేజారిపోతుంటుంది. అలాంటి వారు మంచి ఉద్యోగం పొందలేకపోతున్నామని బాధపడిపోతుంటారు. దీని కారణంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతుంటారు.
జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం.. కోరుకున్న ఉద్యోగం రావాలంటే ముందుగా కష్టపడి పనిచేయాలి. మీరు చేయాల్సిన కష్టాన్ని చేస్తూనే కొన్ని జ్యోతిషశాస్త్ర పరిహారాలను కూడా చేసుకోవాలి. తద్వారా ఈ ఉద్యోగ సమస్యలు సులభంగా పరిష్కారవుతాయి. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందవచ్చు. మీ జీవితంలో నిరుద్యోగాన్ని పొగొట్టుకోవచ్చు. ఉద్యోగ సమస్యను పరిష్కరించడానికి కొన్ని అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి అవేంటో ఓసారి పరిశీలించండి.
హనుమంతుడిని పూజించండి :
హనుమంతుడిని మంగళవారం రోజున పూజించడం వల్ల ఉద్యోగం పొందడంలో ఎదుర్కొనే అన్ని సమస్యలు తొలగిపోతాయి. మీరు ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి సుందరకాండ పారాయణం చేయాలి. అంతేకాదు.. హనుమాన్ చాలీసాను 7 సార్లు పారాయణం చేయాలి. దేశీ నెయ్యితో చేసిన ప్రసాదాన్ని హనుమాన్‌కి సమర్పించండి. ఇలా చేయడం ద్వారా నిరుద్యోగ సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
శివుడిని పూజించండి :
ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే శివుడిని తప్పక పూజించాలి. శివాలయానికి వెళ్లి శివలింగానికి పచ్చి పాలు, బియ్యం సమర్పించాలి. శివుడి అనుగ్రహం కలిగి మీకు తొందరగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
గణేశుడుని పూజించండి :
ప్రథమ పూజ్యుడిగా పేరొందిన గణేశుడుని కూడా క్రమం తప్పకుండా పూజించాలి. ఆయనే మీకు ఉద్యోగం వచ్చేందుకు ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లవంగాలు, వక్కపప్పు వినాయకుడికి నైవేద్యం పెట్టి తీసుకెళ్లాలి.
సూర్య భగవానుడిని పూజించండి :
జ్యోతిషశాస్త్రంలో ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడిని పూజించడం అన్నింటా విజయాలను పొందవచ్చు. ఉద్యోగం ప్రాప్తి కోసం ప్రతిరోజూ సూర్య దేవునికి నీటిని సమర్పించండి. అంతేకాదు.. ఆదివారాలు ఉప్పు, మాంసాహారం లేకుండా ఆహారం తినండి. ఇలా చేయడం ద్వారా మీ కెరీర్‌లోని సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి.
పక్షులకు ఆహారం వేయండి :
ప్రతిరోజూ ఉదయాన్నే, బార్లీ, గోధుమ, జొన్న, బియ్యం, మొక్కజొన్న, జొన్న, పప్పుధాన్యాలు వంటి ఏడు రకాల ధాన్యాలను పక్షులకు తినిపించండి.
Read Also : Indian Army : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే చాలు.. నెలకు రూ.56వేలపైనే జీతం..
విష్ణువును పూజించండి :
మహావిష్ణువును పూజించండి. పేదలకు పసుపు వస్తువులను దానం చేయండి. ఇలా చేయడం వల్ల గ్రహాల వల్ల కలిగే అడ్డంకులు తొలగిపోతాయి. మీకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
రావి చెట్టును పూజించండి :
ప్రతి గురువారం రావి చెట్టుకు నీళ్ళు పోసి పూజించండి. ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లే ముందు మీకు ఇష్టమైనద దైవాన్ని స్మరించుకోండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశాలు పెరుగుతాయి.
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.