Self Confidence Remedies: రాహుకాలంలో ఈ దీపం వెలిగిస్తే.. ఆఖండ రాజయోగం..!

పాజిటివ్ థింకింగ్ పెరగటానికి, విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో దేన్నైనా సాధించగలిగే విధంగా ఆలోచన మారాలంటే చేసుకోవాల్సిన పరిహారాలు ఇవే..

Self Confidence Remedies: రాహుకాలంలో ఈ దీపం వెలిగిస్తే.. ఆఖండ రాజయోగం..!

Updated On : October 12, 2025 / 12:58 AM IST

Self Confidence Remedies: నెగిటివ్ థింకింగ్ పోవాలంటే, నిరాశ నిస్పృహలు తొలగిపోవాలంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే, ఆత్మ విశ్వాసంతో దేన్నైనా సాధించగల శక్తి సామర్థ్యాలు లభించాలంటే ఎలాంటి సులభమైన, శక్తిమంతమైన పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం..

చాలా మందికి ఫెయిల్యూర్ రాగానే నిరాశ నిస్పృహ వచ్చేస్తుంది. ఇక సక్సెస్ అవ్వలేము అనుకుంటున్నారు. అటువంటప్పుడు నెగిటివ్ థింకింగ్, డిప్రెషన్ నుంచి బయటపడేందుకు, పాజిటివ్ థింకింగ్ పెరగటానికి, విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో దేన్నైనా సాధించగలిగే విధంగా ఆలోచన మారాలంటే చేసుకోవాల్సిన పరిహారాలు ఇవే..

పరిహారాలు..

* ఒత్తుల సంఖ్య పెంచుకుంటూ వెలిగించే నిమ్మ దీపాల పరిహారం
* సాధారణంగా రాహు కాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగిస్తుంటారు. దుర్గాదేవి ఆలయం ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు. లేదా సుబ్రమణ్య స్వామి ఆలయాల్లో కూడా నిమ్మకాయ దీపాలు పెడతారు. ఈ నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించే వారు.. ప్రతిసారి రెండు ఒత్తులు చొప్పున పెంచుకుంటూ నిమ్మదీపాలు వెలిగించుకోవాలి.
* ఒత్తుల సంఖ్య పెంచుకుంటూ 11సార్లు నిమ్మదీపాలు వెలిగిస్తే.. అద్భుతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నిరాశ నిస్పృహ అన్నీ తొలగిపోతాయి.
* జన్మ నక్షత్రం రోజున దేవాలయం ప్రాంగణంలో దద్దోజనం (పెరుగన్నం) పంచి పెట్టాలి. కానీ ఆ రోజున పెరుగు తినకూడదు.

* హయగ్రీవుడి ఫోటోని హాల్ లో పెట్టుకోవాలి. రోజూ పని మీద బయటకు వెళ్లే సమయంలో హయగ్రీవుడి ఫోటోకు నమస్కారం చేసుకోవాలి. అప్పుడు చాలా అద్భుతంగా పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది.
* గురు సంబంధమైన ఆలయ ప్రాంగణాల్లో గురువారం పూట భక్తులకు శెనగలు పంచి పెట్టాలి. శెనగలు తాలింపు పెట్టి వాటిని దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, శిరిడీ సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి.. ఇలా గురు స్వరూపమైన ఆలయాల ప్రాంగణాల్లో గురువారం పూట పంచిపెట్టడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరుగుతుంది.
* అలా ప్రతి రోజు ఉదయం సిందూరం బొట్టు పెట్టుకోవాలి. సిందూరం బొట్టు మనోధైర్యాన్ని పెంచుతుంది.
* సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న వాళ్లు కుంకుమ బొట్టుతో పాటు సిందూరం బొట్టు పెట్టుకోవాలి.
* నువ్వుల నూనె దీపాన్ని 41 రోజులు పూజ గదిలో వెలిగించాలి. అలా చేస్తే క్రమ క్రమంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.