జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోది నామ సంవత్సరము, కార్తీక మాస శుద్ధ ఏకాదశి సా 4:04, పూర్వాభాద్ర: ఉ 7: 52, తరువాత ఉత్తరాభాద్ర: రాతె 5:40, మంగళవారం
మేష రాశి: ఈ రోజు మిశ్రమ ఫలితములు ఉంటాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం కఠినంగా ఉంటుంది. ఈ ప్రభావం ఆరోగ్యంపై ఉంటుంది. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని సహనంతో వ్యవహరించడం మంచిది. అన్ని రంగాలవారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఫలవంతంగా ఉంటుంది. వ్యక్తిగతంగా అనవసరమైన వాదనలు అర్థం పర్ధం లేని చర్చలు చేయకూడదు. శత్రువులకు దురంగా ఉండాలి. నవగ్రహ శ్లోకములు పఠించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
వృషభ రాశి: ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడికారణంగా అవిశ్రాంతగా ఉంటారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ప్రతికూల ఆలోచనల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతింటాయి. వ్యాపారంలో తరుచు ఆటంకాలు ఎదురు అవుతాయి కాబట్టి కొత్తపనులకు ఈ రోజు దూరంగా ఉండండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శివారాధనవల్ల శుభఫలితములు కలుగుతాయి.
మిధున రాశి: వృత్తి వ్యాపారములో ఉహించని సమస్యలు, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, మనః శాంతిగా ఉండాలి. కుటుంబంలో ఆనందకరసంఘటనలు జరుగుతాయి. శుభకార్యక్రమములు జరుగుతాయి. బంధువులు నుంచి శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన వల్ల శుభఫలితములు వస్తాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకులంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి ఈ రోజు పని ప్రదేశంలో అనుకూలమైన ఉత్సాహపూరితమైన వాతావరణం ఉండటం వల్ల అన్నిపనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం వల్ల ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మాతృవర్గం నుంచి అందిన శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదభరితంగా చేస్తుంది. మీ ప్రత్యర్థులు ఓటమి పాలవుతారు. శ్రీ విష్ణు సహస్రనామపారాయణంవల్ల శుభం జరుగుతుంది.
సింహ రాశి: ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారములలో శ్రమకు తగిన ఫలితములు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువకావడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆర్థికంగా పొదుపు పాటించడం అవసరము. వ్యక్తిగతంగా ఈ రోజు మీ కోపాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది, ప్రయూణముల వలన లాభములు కలుగుతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరము.
కన్యా రాశి: ఆరోగ్యపరంగా ఈ రోజు కొన్ని సమస్యలు వస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి అదనపు ఆదాయవనరుల కోసం ప్రయత్నిస్తారు. వృత్తి వ్యాపారములకు సంబంధించిన కీలక నిర్ణములు తీసుకునే విషయంలో అనిశ్చితి మనస్తత్వం కారణంగా చెడ్డపేరు వచ్చే ప్రముదం ఉంది. స్థిరమైన బుద్ధితో ప్రశాంతమైన మనసుతో పని చేసి ఖ్యాతి తగ్గకుండా చూసుకోండి. హనుమాన్ చాలిసా పారాయణముతో మెరుగైన ఫలితములు ఉంటాయి.
తులా రాశి: ఈ రోజు శుభకరంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచిరోజు. బాల్యమిత్రులను కలుసుకొని సరదాగా గడుపుతారు. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి. మీతల్లి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము, కోర్టు సమస్యలు, ఆస్తి వ్యవహారంలో జాగ్రత వహించండి. కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా జగ్రత్త పడాలి. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి: ఈ రోజు మిశ్రమైన ఫలితములు ఉంటాయి. వృత్తిపరంగా కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ తెలివి తేటలతో అధిగమిస్తారు. ప్రత్యేకంగా వృత్తినిపుణులకు పనిభారం పెరగడం, ఆశించిన ప్రయోజనాలు లేకపోవడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. ఖర్చులు పెరగవచ్చు, కుటుంబ కలహాలు, అర్థంలేని వాదనల నుంచి దూరంగా ఉండండి. ఈశ్వరుని ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితములు ఉంటాయి.
ధనస్సు రాశి: ఈ రోజు విశేషంగా యోగిస్తుంది, అన్ని రంగాల వారికి ఈ రోజు లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక లాభాలు, కుటుంబంతో తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది, పనిలో విజయ పరంపరలుగా కొనసాగిస్తారు. చేసే ప్రతి పనిలో విజయం వెన్నంటే ఉంటుంది. వృథా ఖర్చులు పెరగవచ్చు. శ్రీమహాలక్ష్మీ ధ్యానం చేయటం వల్ల శుభకరమైన ఫలితములు వస్తాయి.
మకర రాశి: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా చిన్నపాటి సమస్యలు మినహా అంతా ప్రశాంతముగా గడచిపోతుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారములకు కలసివస్తాయి. అదృష్టం వరించి అకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. వాహన ప్రమాదములు జరగకుండా జగ్రత్తపడాలి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన ఉత్తమము.
కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. వృత్తిపరంగా గతకొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో కొంత ఘర్షణ పరిత వాతావరణం ఉంటుంది. సహనంతో ఉండడం ద్వారా ప్రశాంతతను పొందవచ్చు. సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపారులకు రుణభారం నుంచి విముక్తి లభిస్తుంది. విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం వల్ల మేలు కలుగుతుంది.
మీన రాశి: ఈ రోజు శుభకరంగా ఉంటుంది, ఆర్థిక, వృత్తిపరంగా ఈ రోజు లాభాలు. పదోన్నతులు లభించే అవకాశములు మెండుగా ఉంటాయి. అంతేగాక వ్యక్తిగతంగా కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంతోషం, శాంతి సంతృప్తితో ఈ రోజు అంతా ఆనందంగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దృఢపడతాయి. వృత్తిపరంగా పొందిన విజయముల కారణంగా సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. వినాయకుని ఆలయ సందర్శన వల్ల శుభం కలుగుతుంది.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956