Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..!

ఈ రోజు (ఆదివారం, అక్టోబర్ 20, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస బహుళ తదియ: ఉ 6:46, బహుళ చవితి: రాతె 4: 16, కృత్తిక ఉ 8:31 ఆదివారం ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు. 

మేష రాశి: శ్రమకు గుర్తింపు, అధిక లాభములు, ప్రయాణముల వలన లాభములు, అనారోగ్యము, ప్రమాదములు, మానసిక బాధలు, కోపం, ఆవేశం పెరగటం, కోర్టు సమస్యలు పరిష్కా రము కావడం, నూతన వ్యాపారములు, అధిక పెట్టుబడులు, ముందుచూపుతో వ్యవహరిస్తారు, అన్ని విషయములలో ముందజంలో ఉంటారు. అంగారక గ్రహస్తోత్ర పారాయణము చేయటం వల్ల ఉత్తమ ఫలితములు పొందుతారు. 

వృషభ రాశి: ఆవేశం తగ్గించుకోవాలి, అనవసర నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం, వివాదాలు రాకుండా ఉండాలి, మంచి ఆలోచనలు, ప్రయాణముల వలన లాభములు, వ్యాపారములలో లాభములు, విద్యార్థులకు అనుకూలము: విష్ణుస్తోత్ర పారాయణం చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి.

మిథున రాశి: ఉద్యోగ లాభం, పనులు వేగవంతగా ఉంటాయి, చిరు వ్యాపారులకు లాభములు, విదేశీ యానము, నూతన వ్యాపారములు ప్రారంభించటం, విద్యార్థులకు అనుకూలము, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం, అనవసరపు రాద్దాంతములు, కోర్టు సమస్యలు – గకార అష్టోత్తరముతో గణపతిని ఆరాధన చేయవలెను.

కర్కాటక రాశి: బుద్ధి చాంచల్యము, రావలసిన బాకీలు వసూలు కాకపోవడం. ప్రయాణములు యందు ఇబ్బందులు, నీచ స్త్రీ మూలక కలహములు, జాయింటు వ్యాపారులతో ఇబ్బందులు, పై అధికారుల ఒత్తిడి, ఆరోగ్యము కుదుట పడుతుంది: శివార్చన, శివాలయ సందర్శన చేయడం ఉత్తమము.

సింహ రాశి: పిత్రార్జితం కలిసి రావటం, కోర్టు సమస్యలు పరిష్కారం కావడం, బంధు వర్గంలో గౌరవము, ఇరుగుపొరుగు వారితో అనుకూలము, సంతోషముగా ఉంటారు: ఇష్టదైవ ఆరాధన చేయడం మంచిది.

కన్యా రాశి: ఉద్యోగం అనుకూలం, మానసిక ఆందోళనలు, కుటుంబంలో గౌరవం, వ్యాపారంలో ప్రతికూల ఫలితములు, ప్రతి విషయంలో అలజడులు, అకాల భోజనము, వ్యాపార విస్తరణ, బంగారం, కార్లు కోనిగోలు చేయడం, సుఖనిద్ర కలగడం: లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

తులా రాశి: కష్టాలు నష్టాలు, విందు వినోదములు, వ్యాపార విస్తరణ, సుఖ నిద్ర, వాహనసౌఖ్యం, నూతన లాభములు, స్థానచలనము, మానసిక ప్రశాంతత లేకపోవడం, ధన ఆదాయం పెరగడం, శుభవార్తలు, విదేశీయునం, ఆహార సంబంధ సమస్యలు, వృధా భ్రమణం: ఆంజనేయస్వామ ఆరాధ్య చేయవలను, శుభ ఫలి తములు కలుగుతాయి.

వృశ్చిక రాశి: నూతన వ్యాపారాలు, అనారోగ్యం, వివాదాలు, నూతన వ్యక్తుల పరిచయం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, శరీర శ్రమ, బదిలీలు, అజీర్ణ బాదలు, సంతానముతో విరోధము, ధన లాభము, అన్ని పనులు విజయవంతం కావడం, వ్యాపారములో లాభములు: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితమలు కలుగుతాయి.

ధనస్సు రాశి: ప్రతి విషయము జాగ్రత్తగా ఆలోచించాలి, ధనలాభము, మానసిక స్థితి విషయంలో జాగ్రత్త అవసరము, ధనము విషయంలో కలసిరావడం, స్త్రీ సుఖము, స్నేహితుల ద్వారా లాభములు, చిరువ్యాపారముల వారికి లాభములు, స్థానచలనము: ఈశ్వర ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితములు వస్తాయి.

మకర రాశి: కుటుంబంలో ఆనందం, విలువైన వస్తువులు కొనుగోలు, ఋణ బాధలు తగ్గుతాయి, ధన వృత్తి విషయములో అభివృద్ధి కలుగును, పుణ్యక్షేత్రములు, బంధు మిత్రులతో విందులు వినోదములు, అభివృద్ధి కలుగును. నూతన ఆలోచనలు – దుర్గా ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

కుంభ రాశి: అనవసరపు మాటలు, ఇతరుల వలన గొడవలు, ప్రమాదములు రాకుండా జాగ్రత్తపడవలెను, బద్దకం పెరగకూడదు, లౌకికంగా ఉండాలి, మధ్యవర్తిత్వం పనికిరాదు: ఇష్టదైవ ఆరాధన వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

మీనా రాశి: ధననష్టం, వృధా ప్రయాణములు, చికాకులు, అలసట, వస్తువు కొనుగోలు, నూతన అవకాశములు, స్థిరాస్తి పెరగడం, ధన ధాన్య సమృద్ధి కలగడం, విద్యార్థులకు అనుకూలము: దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు పొందుతారు.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956