Today Horoscope : నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి మానసిక ఆందోళనలు..!

ఈ రోజు (2024, నవంబరు 27, బుధవారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Today Horoscope : నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి మానసిక ఆందోళనలు..!

Updated On : November 26, 2024 / 4:28 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోది నామ సంవత్సర కార్తీక మాస బహుళ ద్వాదశి పూర్తిగా, చిత్తా నక్షత్ర పూర్తిగా ఉంటుంది.. బుధవారము

మేషం: శత్రువులు మిత్రులుగా మారుతారు పై అధికారుల ఆదరాభిమానం పొందడం ధన లాభం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశము. స్త్రీల వలన లాభము, నూతన వ్యాపారంలో ధన లాభము. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయడం. అందరు ఆరోగ్యకరముగా ఉండటం గౌరవ మర్యాదలు లభించడం, మృష్టాన్న భోజనం చేయడం, ప్రయాణములలో ప్రముఖ వ్యక్తుల కలయిక ద్వారా లాభములు కలగడం. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన వలన ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

వృషభం : బద్దకము పెరగడం, మనస్సుకు ప్రశాంతత లేకపోవడం, భయము కలగడం, సంతానం ద్వారా గొడవలు, ఇబ్బందులు రావడం, ఏ నిర్ణయము త్వరగా తీసుకోలేరు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, మనస్తాపము, వృత్తి ఉద్యోగములలో రాణింపు లేకపోవడం, తీర్థయాత్రలు చేయడం, భార్య భర్తల మధ్య అభిప్రాయ బేదములు, విరోధములు. తారా మహదేవి స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

మిధునం: ప్రయాణములలో ఇబ్బందులు, అనవసర విషయములలో కలహములు, ఆటంకములు కోర్టు గొడవలు, శుభకార్యక్రమములలో ఆటం కములు, బంధుమిత్రులతో విరోధములు స్థానభ్రంశము, అనారోగ్యము, బుణబాధలు భాగస్వామ్యంతో చికాకులు బుద్ధి చాంచల్యము ఆవేశంతో గొడవలు. సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

కర్కాటకం: కుటుంబంలో సఖ్యత పెరగడం కోర్టు సమస్యలు పరిష్కారము కావడం, అన్నదమ్ములతో సఖ్యత పెరగడం, మంచి ఉద్యోగం లభించడం, బంధువర్గంలో గౌరవం పెరగడం, వృత్తిలో లాభము, ధైర్యము పెరగడం, విదేశాలకు వెళ్ళడం ఆరోగ్యము కుదుటపడటం అనవసరము లేని విషయములలో కల్పించుకోకూడదు దుస్తులు కొనుగోలు చేయడం, సంతానము ద్వారా శుభవార్తలు రావడం. ఇష్టదైవ ప్రార్ధన వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

సింహ: మానసిక ఆందోళనలు గురికావడం, నమ్మి మోసపోవడం. బాకీలు, ఋణ బాధలు, మోసముకు గురి కావడం, దీర్ఘకాలిక వ్యాధి బాధలు, ధన నష్టము, విరోధములు, భాగస్వామ్య వ్యాపారంలో అలజడులు, తగాదాలు, కుటుంబంలో చికాకులు అపాయములు ప్రయాణములు వాయిదా పడటం అలసట, ఉద్యోగంలో ఇబ్బందులు.
శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధనవల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

కన్యా: వృత్తిలో ఉద్యోగములో ఆనందముగా ఉండటం, ఆరోగ్యము కుదుటపడటం, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం, బంధు మిత్రులతో విందులు, వినోదములు గడుపుతారు నూతన వ్యాపారములలో లాభములు, నూతన ఉద్యోగములు, అమ్మకాలు, పెరగడం, సరియైన నిర్ణయములు తీసుకోవడం. ప్రయాణములు చేయడం, అభివృద్ది పదంలో ముందుకు వెళ్లడం. శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

తుల: వివాహాది శుభకార్యములకు ఆటంకములు కలుగుతుంది. మనస్సు ఇబ్బందికరమైన సంఘటనలు కలుగును. సోమరితనము కలగడం, ప్రయాణంలో ఆసక్తికర సంఘటనలు జరగడం, ధనము విషయంలో పొదుపు పాటించడం, మాట పట్టింపులు గృహ నిర్మాణములో ఆటంకములు, అపాయములు పై అధికారుల ద్వారా మాట పట్టింపులు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

వృశ్చికం: శుభవార్తలు వినడం, కార్యసిద్ధి, సద్గోష్టి, ధన లాభము, కుటుంబ సౌఖ్యములు, బంధుమిత్రులతో విందు వినోదములతో కాలము గడుపుతారు లాభదాయకమైన ప్రయాణములు చేస్తారు ఇష్టులైన వారితో సంప్రదింపులు జరపడం వల్ల లాభములు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగములందు ఊహించని లాభములు కలుగుతాయి, సంతానము ద్వారా శుభవార్తలు కలుగుతాయి. శివాలయ ప్రదక్షణలు చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

ధనస్సు: కొత్త వ్యక్తులతో పరిచయముల వలన లాభములు కలగడం, చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార ములలో అభివృద్ధి రాణింపు ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, శుభకార్యక్రమములలో పాల్గొనడం. చేపట్టిన పనిలో సానుకూలత. ఆరోగ్యము, సుఖ సంతోషములు కలగడం. శత్రు నాశనము, సంఘంలో గౌరవం పెరగడం. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రములు చదవడం వల్ల శుభం కలుగును.

మకరం: ఉద్యోగ, వ్యాపారములలో మార్పులు కార్య రంగంలో ప్రతికూలత, బంధు మిత్ర పుత్ర విరోదములు. కుటుంబ సమస్యలు, అన్య స్థల నివాసము ఉద్యోగంలో భయము, శత్రువృద్ధి, స్త్రీల మూలంగా ఇబ్బందులు, ఆరాచకములు, నిద్రలేమి అకారణ వైరము, కలహములు, బంధుమిత్రులతో జాగ్రత్త అవసరము. లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

కుంభం: నరాల బలహీనత, మానసిక ప్రశాంత లేకపోవడం, సరియైన సమయంలో సరియైన నిర్ణయము తీసుకోలేక పోవడం, ధన నష్టము అకారణ వైరము, అనారోగ్యము గురించి ధనము ఖర్చు కావడం, విరోధములు, కోర్టు సమస్యలు వ్యాపారములో చికాకులు, ఊహించని నష్టములు, సోమరితనము అధికం కావడం, ప్రయాణములలో ప్రమాదములు. శ్రీ విష్ణు స్తోత్రము పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

మీనం: నూతన విషయములలో అభివృద్ది కీలక అంశములపై చర్చలు, ప్రతి పనిని సమర్ధవంతము నిర్వహించటం, ధన ధాన్యలాభముల అన్య స్త్రీ పరిచయము, వృత్తి ఉద్యోగములలో లాభములు కలగడం, కీర్తి ప్రతిష్టలు కలగడం, ఆదరాభిమానములు పొందడం, గౌరవ సన్మానములు పొందడం నగలు విలువైన వస్త్రములు కోనుగోలు చేయడం అభివృద్ధి కలగడం.
అమ్మవారి ఆరాధన వలన శుభం కలుగును.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956