Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి నేడు ధన లాభం కలుగును

ఈ రోజు (బుధవారం, అక్టోబర్ 09, 2024న) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాలు వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

 శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస శుద్ధి షష్ఠి : మ 12:14, మూల రాతె 5 : 15 నిమిషములు బుధవారము ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు

మేష రాశి: కుటుంబంలో ఇబ్బందులు అనవసరమైన తగాదాలు, చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా తీసుకోకూడదు, ధనవ్యయం, ప్రయాణములో అలసట, వృత్తి ఉద్యోగ భంగములు కలుగును, విద్యార్థులకు చదువులపట్ల ఆసక్తి, కోర్టు సమస్యలు పరిష్కారములు అవడం: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మేలు కలుగును.

వృషభ రాశి: అన్ని పనులు సకాలంలో కావడం, వృత్తి వ్యాపార రంగములో అభివృద్ధి, ప్రయాణముల వలన లాభము కలగడం, శుభకార్యక్రమములు నిర్వ హించుట, ప్రతి పనిలో విజయము, అన్నింటా లాభము, నూతన వ్యాపారములో విజయం, స్త్రీలు ఉద్యోగం గురించి ఆలోచన చేస్తారు: స్తోత్ర పారాయణం చేయడం వల్ల అంత శుభం జరుగుతుంది

మిథున రాశి: కుటుంబములోని వారు ఆరోగ్యంగా ఉంటారు, ధనధాన్య సంపదలు, స్త్రీలతో ప్రియ సంభాషణలు చేయడం, ధార్మిక పద్దతులతో నడుచుకుంటారు, దైవ పుణ్య కార్యములలో పాల్గొంటారు, పై అధికారుల ఆదరాభిమానములు పొందుతారు: శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం చేసినచో శుభ ఫలితములు పొందుతారు.

కర్కాటక రాశి: మనో వేదన వలన సరైన నిర్ణయానికి రాలేరు, సంతానం ద్వారా శుభవార్తలు, మనశ్శాంతి లోపించండం, ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్లడం, దూర ప్రయాణములు, అన్నింటా విజయం, నూతన వ్యాపారములు ప్రారచించవచ్చు, విధ్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు : దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేసినా మేలు కలుగును.

సింహ రాశి: స్వస్థానములో మేలు జరుగును, ధనధాన్య లాభములు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగును, సంఘంలో గౌరవము, అన్య స్త్రీ పరిచయ భాగ్యములు, ప్రతి పనిని సమర్ధవంతముగా నిర్వహిస్తారు, ప్రయాణముల వలన లాభములు కలుగుతాయి: శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధనవల్ల మేలు కలగును

కన్యా రాశి: బంధు విరోధము, బుద్ధి చాంచల్యమును కలుగును, శరీర పీడ, నీచ స్త్రీ మూలక కలహములు, అనవసర కార్యములకు ధనవ్యయము, అపకీర్తి రాకుండా కాపాడుకోవాలి, రుణబాధలు, మోసపోవడం, ఎవ్వరిని నమ్మ కూడదు, బంధువర్గంలో గౌరము పెరుగును: ఇష్ట దైవ ఆరాధన చేసినచో అంతా మేలు జరుగును

తులా రాశి: పిత్రార్జితము రావడం, మంచి ఉద్యోగము రావడం, ధనలాభము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు, అన్నదమ్ములతో అనుకూలతలు కలుగును, వివాహ సంబంధములు కుదురును, సంతానము ద్వార శుభవార్తలు, అన్ని పనులలో విజయము, బంధుమిత్రులతో విందు వినో దములతో కాలము గడుపుదురు : శివారాధన చేయటం వల్ల ఇబ్బందులు తొలగి పోతాయి

వృశ్చిక రాశి: ధన విషయంలో చికాకులు, అకాల భోజనములు, రోగ బాధలు కలుగును, ఉద్యోగంలో ప్రతికూలము, ప్రయాణాల్లో లాభములు, మానసికవేదనలు, ప్రతి విషయములు విచారములు కలగడం, నమ్మినవారివలన మోసపోవ బంధు మిత్రులతో విరోధములు కలగడం, అనవసర విషయములలో జాగ్రత్త అవసరం, వ్యాపారంలో ఇబ్బందులు: అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఉత్తమైన ఫలితములు కలుగును

ధనస్సు రాశి: ఆకస్మిక ప్రయాణముల వలన లాభములు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయటం, జాయింట్ దారులతో ధనప్రాప్తి, వస్త్ర లాభము, ఆరోగ్యము, జయము ఎంతటి పనినైనను ధైర్యసాహసములతో చేసి విజయమును పొందుతారు, అన్నదమ్ములతో అనుబంధం పెరుగును. దూర ప్రాంతపు ప్రయాణములు అనుకూలించును: శ్రీ రామనామజపం చేయండి వలన శుభఫలితములు కలుగుతాయి.

మకర రాశి: కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం, దూరప్రాంతములకు వెళ్లవలసివచ్చును, శుభ కార్యక్రమాలకు ఆటంకములు, విద్యుత్తు పరికరములు, మిషనరీలు వాహనమలు కొనుగోలు, రావలసిన బాకీలు వసూలు చేయుట, నూతన వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేయడం: దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల సమస్యలు తొలగుతాయి.

కుంభ రాశి: కుటుంబములోని వారికి ఆరోగ్యం తగ్గుతుంది. చేయు పనుల యందు కష్టనష్టాలు ఎదురవుతాయి, పనిలేని ప్రయాణాలు, పై అదికారుల వత్తిడి పెరుగుతుంది, ఉద్యోగ వ్యాపారముల యందు దిగువ వారి సహాయములు ఉండవు: శ్రీ కృష్ణ మంత్ర జపం చేయడం వలన మంచి ఫలితములు కలుగుతాయి

మీనా రాశి: ఆర్థిక లాభములు, అనారోగ్యములు, వృత్తి వ్యాపారాలలో అధిక లాభము, వాహనాలు కొనుగోలు చేయడం, శత్రువులు మిత్రులుగా మారడం, భూలాభములు, ఇండ్లు కొనుగోలు చేయడం, స్నేహితులతో గడపటం, భార్య భర్తల మధ్య అనుకూలత, బుణభాధలు తగ్గడం: శ్రీ ఆంజనేయస్వామి వారి ఆరాధన వలన మేలు జరుగుతుంది.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956