Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అధిక ఆదాయం కలుగును..!

ఈ రోజు (సోమవారం, అక్టోబర్ 14, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అధిక ఆదాయం కలుగును..!

Updated On : October 13, 2024 / 5:15 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస శుద్ధ ఏకాదశి : ఉ 6:41. శుద్వాదశి: రాతె 3:42, శతభిషం : రా 12:43 సోమవారము ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు. 

మేష రాశి: అనుకున్న పనులలో విజయం, ప్రతి విషయంలో విజయం సాధించడం, మంచి సలహాలు తీసుకుంటారు, ఉద్యోగ, వ్యాపారములలో లాభములు, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం, ప్రయాణములు చేయడం, తీర్ధయాత్రలు చేయడం: కనకధార స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

వృషభ రాశి: అధిక వ్యయం, ఆర్థిక పరంగా జాగ్రత్త అవసరం, అధిక ప్రయాణములు, అనవసరపు రాద్ధాంతం, కోర్టు సమస్యలు, బంధుమిత్రులతో సహనంగా ఉండాలి, అతి జాగ్రత్తలు అవసరం, అనవసరపు విషయముల మీద ఏకాగ్రత ఉండకూడదు: సుందరకాండ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

మిథున రాశి: స్థాన భ్రంశము, కార్యరంగంలో ప్రతికూలత, శత్రువృద్ధి, కుటుంబంలో సమస్యలు, అధిక ఆదాయం, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగములలో అభివృద్ధి. అన్నింటా విజయం, మంచి నిర్ణయములు తీసుకోవడం, అదికారుల ఒత్తిడి, కోర్టు వివాదములు, నిరాశ కలుగుతుంది: శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన వలన శుభ ఫలితములు కలుగుతాయి.

కర్కాటక రాశి: ధనలాభము, నూతన వస్త్రలాభము, మనో ధైర్యము, ఇష్ట స్త్రీ సంగమం, అన్నదమ్ము లతో అనుకూలము, కుటుంబంలోను, చేయు వృత్తులయందు సుఖశాంతులు పొందుతారు: గణపతి ఆరాధన వలన ఉత్తమ ఫలితము కలుగుతాయి. 

సింహ రాశి: ధనవిషయంలో చికాకులు, నమ్మినవారి వలన మోసము, మనోవిచారము, రోగభా ధలు, స్త్రీ మూలక, తల్లి మూలకంగా ఇబ్బందులు,
రుచించని భోజనములు: శివ ఆరాధన వలన మంచి శుభఫలితములు కలుగుతాయి.

కన్యా రాశి: శరీర సౌఖ్యము, వ్యాపారంలో ఆరోగ్యము, సంతోషము, ఉత్సాహము, అభివృద్ధి, సన్మానము, ఉద్యోగ లాభం, నూతన వ్యాపారములు: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన వలన శుభములు జరుగుతాయి.

తులా రాశి: శరీరసౌఖ్యము, సంతోషం, ఉద్యోగ ప్రాప్తి, ఉత్సాహం, అభివృద్ది, సన్మానం, నగలు విలువైన వస్త్రములు కొనుగోలు చేయట, ధన, వృత్తి విషయంలో అభివృద్ది కలుగుతుంది: దుర్గాదేవి ఆరాధన వలన శుభ ఫలితములు కలుగుతాయి. 

వృశ్చిక రాశి: అగౌరవం, ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపారములో చికాకులు, నిరాశ, శరీర శ్రమ, ఆపదలు సంభవించండం, వివాహ ప్రయత్నములలో ఆలస్యము, సంతానలాభము, భయము: శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన వలన శుభం కలుగుతుంది. 

ధనస్సు రాశి: నిరుద్యోగులకు ఉద్యోగం, విదేశయ ప్రయత్నములు అనుకూలము, శుభవార్తలు, వివాహ ప్రయత్నములలో అనుకూలము, కోర్టు సమస్యలు పరిష్కారము కావడం, నూతన వ్యాపారములు: ఇష్టదైవ ఆరాధన వలన ఉత్తమ ఫలితములు కలుగుతాయి. 

మకర రాశి: వృత్తి ఉద్యోగ వ్యాపారములో అభివృద్ధి, సుఖ సంతోషములు, విధ్యార్థులకు అనుకూలం, తీర్ధయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్మన, నేత్ర సంబంధ వ్యాధులు, అన్నింటా లాభం, స్థిరాస్థుల వృద్ధి, ప్రేమ కలాపాలు, కార్యలాభము: లక్ష్మీజపము చేసినచో ఉత్తమమైన ఫలితములు కలుగుతాయి. 

కుంభ రాశి: కార్యరంగంలో ప్రతికూలత, బంధు మిత్ర పుత్ర విరోధము, కుటుంబ సమస్యలు, వృధా ప్రయాణం, వ్యాపారవృద్ధి సుఖ సంతోషములు, శుభ కార్యనిర్వహణ, స్థిరాస్తులతో లాభం, ధనాదాయం, ప్రయాణములు: శ్రీ నరసింహస్వామి వారి ఆరాధన వలన మంచి ఫలితాలు వస్తాయి.

మీనా రాశి: ధననష్టం, వృధా ప్రయాణములు, చికాకులు, అలసట, వస్తువు కొనుగోలు, నూతన అవకాశములు, స్థిరాస్తి పెరగడం, ధనధాన్య సమృద్ధి కలగడం, విధ్యార్థులకు అనుకూలము: దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు పొందుతారు. 

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956