Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి కీర్తి నాశనం..!
ఈ రోజు (2024 డిసెంబర్ 07, శనివారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోది నామసంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు మార్గశిరమాస శుద్ధ షష్ఠి : మ 11: 05, ధనిష్ఠ : సా4:50 శనివారం
మేష రాశి: అధికార భయం, నిర్ణయలోపము, కాలయాపన, కీర్తి నాశనం, కీర్తి వృద్ధి పెరగడం, మానసిక ఒత్తిడి పెరగడం, బంధుమిత్ర సహకారముతో కార్యవిజయము, ఆరోగ్యం, ధనలాభము, పుణ్యకార్యములు, కార్యసిద్ధి, దైవభక్తి పెరుగుతుంది. విధ్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం, శుభకార్య ప్రయత్నములు లాభించును. రుద్రాభిషేకం, శివాలయములో దేపతైల సమర్పణ, విశ్వనాధాష్టకము వలన ఉత్తమమైన ఫలితములు కలుగును.
వృషభ రాశి: శుభకార్యక్రమములకు ధనవ్యయం, మనోవిచారము, శ్రమ అధికము, గౌరవం తగ్గటం, ధననష్టం. ప్రయాణములలో ఇబ్బందులు, ప్రభుత్వ అధికార భయములు, పనులయందు ఆటంకములు. అకాల భోజనం, వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. గృహ నిర్మాణపనులు లాభించుట. ఆంజనేయ దండకం పఠించటం వల్ల శుభఫలితములు కలుగును.మిధునం రాశి: ధర్మకార్యక్రమాలలో పాల్గొనుట, వృత్తి వ్యాపారములలో పని భారం పెరగడం, సంతానపరమైన బాధ, స్వల్పసుఖం, అధర్మ కార్యములకు సహకరించుట, స్త్రీమూలకంగా భయం కలగడం, లాభనష్టాల మిశ్రమం, అనవసరమైన విషయములలో తలదూర్చకూడదు. సంఘంలో గౌరవమర్యాదలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు. లక్ష్మీనారాయణ స్వామి వారి ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
కర్కాటక రాశి : ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, వృధా ప్రయాస, కుటుంబ సౌఖ్యం, ఆకస్మిక ధనలాభము, స్త్రీ మూలకంగా లాభం కలగడం, ఇతరులకు సహకారము అందించుట, బంధు మిత్రులతో వైరము, ఉద్యోగ వ్యాపార విషయములలో జాగ్రత్త అవసరము. హయగ్రీవస్తోత్ర పారాయణము చేయటం వల్ల శుభం కలుగును.
సింహ రాశి: శుభకార్య ప్రయత్న లాభం, స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారములలో అనుకూలము, విదేశీయానం, అనవసరపు ప్రయూణములు, శ్రమ అధికము, కుటుంబంలో శుభకార్యసిద్ధి, కోపముతో వివాదములు పెరగటం. నూతన కార్య సిద్ధి, ఆర్ధికం పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. లక్ష్మీనరసింహస్తోత్ర పారాయణం చేయవలెను.
కన్యా రాశి: వృధా ప్రయాణములు, ఆటంకముల తరువాత విజయం, కుటుంబ వ్యక్తులకు ఇబ్బందులు, మాటపట్టింపులు, వృధా ఖర్చులు పెరగడం, శుభకార్యములకు ధనవ్యయం, నూతన ప్రయత్నములు లాభించుట, వృత్తి ఉద్యోగములలో శ్రమ అధికం, ప్రముఖ వ్యక్తులతో కలయిక వలన లాభము కలుగును. కాలభైరవాష్టకం చదవడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
తులా రాశి: ఈ రోజు శుభ ఫలితములు కలుగుతాయి. ప్రయాణమువలన లాభములు కలుగుతాయి. వృత్తి పరంగా ఆశించిన ప్రయోజనములు పొందుతారు. ఖర్చులు పెరగడం, వృత్తిపరంగా ఆశించిన ప్రయోజనములు కలుగుతాయి. కీలక వ్యవహారములలో నిర్ణయములు తీసుకోవడంలో స్పష్టత లోపిస్తుంది. గిట్టని వారి మాటలు పట్టించుకోవద్దు. విద్యార్థులకు అనుకూలము. శ్రీ దత్తాత్రేయ పారాయణము చేయడం వల్ల శుభం కలుగుతుంది.
వృశ్చికము : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణములు చేయడం, ఆర్థికపరంగా లాభములు కలగడం, వ్యాపారములలో లాభములు, ఉద్యోగంలో అనుకూల ఫలితములు కలగడం, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము, ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు మరి కొంతకాలం ఎదురుచూడాలి, కుటుంబంలో ఆనందము కలగడం, విలువైన ఆభరణములు, కొనుగోలు చేస్తారు. శివారాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
ధనస్సు రాశి : ప్రతి విషయము జాగ్రత్తగా ఆలోచించాలి. ధనలాభము కలుగుతుంది. మానసిక స్థితి విషయంలో జాగ్రత్త అవసరం. ధనము విషయంలో కలిసి రావడం జరుగుతుంది. స్నేహితుల ద్వారా లాభములు, చిరు వ్యాపారములు వారికి లాభము, స్థానచలనము కలుగుతాయి. (ఈశ్వర ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితములు వస్తాయి)
మకర రాశి : కుటుంబంలో ఆనందం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తగ్గుతాయి. ధన వృద్ధి విషయంలో అభివృద్ధి కలుగుతుంది. పుణ్యక్షేత్రములు, బంధుమిత్రులతో విందులు, వినోదములు అభివృద్ధి కలుగును. నూతన ఆలోచనలు చేస్తారు. (దుర్గా ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి)
కుంభ రాశి : అనవసరపు మాటలతో సమస్యల వస్తాయి. ఇతరుల వలన గొడవలు. బద్దకం వీడాలి, లౌకికంగా ఉండాలి. మధ్య వర్తిత్వం పనికిరాదు. (ఇష్టదైవ ఆరాధన వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి)
మీన రాశి: శుభవార్తలు వినడం, మంచి ఆలోచనలు చేయడం, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం, లాభదాయకమైన ప్రయాణములు చేయడం, బాధ్యతలు పెరగడం, విలువైన ఆస్తులు సంపాదించడం స్థాన చలనం, మానసిక వేదన. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన వలన మంచి ఫలితములు కలుగుతాయి.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956