Infertility: స్త్రీలకు వంధ్యాదోషము శాపములాంటిది. సర్పదోషము వలన కూడా ఈ వంధ్యత్వం కలుగుతుంది. దశవిధ వంధ్యాదోషములలో ఏ విధముగానైనా ఈ దోషము సంభవించవచ్చు. స్వయంకృతాపరాధమువలన కూడా వంధ్యాదోషము కలుగ వచ్చు.
ఈ వంధ్యాదోషము వలన స్త్రీలు సంతానహీనులవుతారు. ఈ విధంగా సంతానహీనులగు స్త్రీలకు ఆదివంధ్య, గర్భవంధ్య, గర్భేవంధ్య, మృతవంధ్య, కదళీవంధ్య, కాకవంధ్య, దైవవంధ్య, రజోవంధ్య, వంధ్యా భర్తృవంధ్య అను ఈ దశవిధవంధ్యలు సంతాన హీన దోషప్రదమైనవిగా గుర్తించారు. ఈ వంధ్యత్వం పూర్వజన్వ కర్మ ఫలితము వలన సంభవించును.
శ్లో॥ స్త్రీలక్షణ హీనాయా ఆదివంధ్యా ప్రకీర్తితాః
శ్లో॥ గర్భవంధ్యా ద్వితీయస్యా ద్గర్భంగ కరీహిసా।
పై శ్లోకముల ప్రకారము సంతానము కలుగదని తెలుస్తున్నది. స్త్రీలు మైలవస్త్రములను చెట్లలో వేయటం వలన, మంచివృక్షాలను లేక దేవతా సంబంధమగు మొక్కలను తాకుటవలన సంతానయోగము హరిస్తుంది. గృహమందలి వంటచేయు సందర్భములో జీవహింస ఫలితంగా అశుచిగా నుంచి దినచర్య లోపము చేత గర్భవిచ్ఛిత్తి జరుగును. ఇలా తెలిసీతెలియని చేసిన పాపము వలన సంతాన దోషములు కలుగును. ఈ సంతాన దోషమునకు నాగదేవతాపూజా విధానము వలన సంతానం కలుగును.
వంధ్యత్వ దోషనివారణకు రెమెడీస్
1) రాహుకేతువుల పూజ
2) జాతకచక్రంలో పంచమాధిపతి పంచమస్థానంలో నుంచే గ్రహము వాటి దృష్టి గురించి విచారించి ఆయాగ్రహమములకు జపములు దానములు, హోమములు చేయుట
3) నాగ ప్రతిష్ఠ చేసుకొనుట
4) తొలిచూలు ఆవుపాలతో నాగకేసరముల చూర్ణమును ఋతుస్నానతయైన తర్వాత వారంరోజులు తీసుకుంటే సంతానము కలుగుతుంది
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956