×
Ad

Powerful Remedies: మీ పిల్లలకు చెడు అలవాట్లు ఎక్కువగా ఉన్నాయా? చెడు మార్గంలో వెళ్తున్నారా? ఈ శక్తిమంతమైన పరిహారాలు చేస్తే చాలు..!

నెలకు ఒకసారి మీ పిల్లలకు ప్రత్యేకమైన దిష్టి తీయించండి. ఒక నల్ల వస్త్రం తీసుకుని..

Powerful Remedies: మీ పిల్లలకు చెడు అలవాట్లు ఎక్కువగా ఉన్నాయా? చెడు మార్గంలో వెళ్తున్నారా? చెడ్డ స్నేహాల వల్ల ఇబ్బందులు పడుతున్నారా? వీటన్నింటి నుంచి మీ పిల్లలు బయటపడాలంటే ఎలాంటి శక్తిమంతమైన పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం..

* పిల్లలు చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలంటే వారి మెడలో తులసి మాలికను ధరింపజేయాలి. జపమాలికల్లో తులసి మాలకు చాలా శక్తి ఉంటుంది. తులసి మాల మెడలో ఉన్న పిల్లలు సాధ్యమైనంత వరకు చెడు అలవాట్లవైపు వెళ్లరు.
* రుద్రాక్ష మాలికకు పంచ లోహాలతో చుట్టించి పిల్లల మెడలో వేయాలి. పంచ లోహాలతో చుట్టించబడిన రుద్రాక్ష మాలికను కానీ తులసి మాలికను కానీ పిల్లల మెడలో ధరింపజేస్తే వారు చెడు మార్గం, చెడు స్నేహం, చెడ్డ అలవాట్ల నుంచి తొందరగా బయటపడతారు.

* పిల్లల జన్మ నక్షత్రం రోజున దేవాలయం దగ్గరికి తీసుకెళ్లి అక్కడున్న వృద్ధులకు (బిచ్చగాళ్లు) వారి చేతితో దుప్పట్లు దానం ఇప్పించండి.
* మీ పిల్లలతో ఖాళీ ప్రదేశంలో రావి మొక్క, వేప మొక్క నాటించాలి. దానికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయమని చెప్పండి. రావి మొక్క, వేప మొక్క లక్ష్మీనారాయణుల స్వరూపం. వారి అనుగ్రహంతో పిల్లలు మంచి మార్గంలోకి వస్తారు.

* అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో డంక శబ్దం వినిపిస్తూ ఉంటారు. ప్రదోష కాలంలో పిల్లలను తీసుకుని శివాలయానికి వెళ్లాలి. డంకా శబ్దం వారు వినేలా చూడాలి. డంకా శబ్దం అనేది ఒక వైబ్రేషన్ కలిగింపజేస్తుంది. దాని వల్ల కూడా క్రమ క్రమంగా చెడు మార్గం నుంచి బయటకు వస్తారు.
* పిల్లలను ఎప్పుడైనా ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ పేషెంట్లకు పండ్లు ఇప్పించాలి. ఇలా చేస్తే వారి ఆలోచన మారి మంచి మార్గంలోకి వస్తారు.

* అలాగే మీ పిల్లలు చెడు మార్గాలు, చెడు స్నేహాలు వీటన్నింటి నుంచి బయటపడాలంటే ఇంట్లో ధన్వంతరి చిత్రపటాన్ని హాల్ లో ఉంచాలి. దేవతల వైద్య గురువు ధన్వంతరి. సాక్ష్యాత్తు విష్ణూ మూర్తి అవతార స్వరూపం. పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు ఆ ధన్వంతరి చిత్రపటానికి నమస్కారం చేసుకుని వెళ్లమని చెప్పండి. అలా చేయడం వల్ల వారి మనసులో మంచి ఆలోచనలు వస్తాయి. చెడు మార్గాలు, చెడు స్నేహాల నుంచి తొందరగా బయటపడతారు.

* నెలకు ఒకసారి మీ పిల్లలకు ప్రత్యేకమైన దిష్టి తీయించండి. ఒక నల్ల వస్త్రం తీసుకుని ఆ వస్త్రంలో నల్ల నువ్వులు, ఉప్పు కలిపి మూట కట్టి దాంతో పిల్లలకు దిష్టి తీయాలి. నెలకు ఒకసారి అమావాస్య రోజు కానీ లేకపోతే మంగళవారం కానీ ప్రత్యేక మూటతో పిల్లలకు దిష్టి తీసి దూరంగా పారేయాలి. దీని వల్ల కూడా క్రమక్రమంగా చెడు అలవాట్ల నుంచి మీ పిల్లలు బయటపడతారు.