పునర్జన్మ వృత్తాంతం..
మానవుడు మరణించిన తరువాత జీవి ఆత్మ దేహమును విడిచిపెట్టిన తరువాత 49 రోజుల వరకు మనచుట్టూ తిరుగుతుంది. వాళ్ల బంధువుల చుట్టూ ఆత్మతిరుగుతుంది. మన ఆచారము ప్రకారము చనిపోయిన రోజులలో గరుడపురాణము చదువుతారు. టిబెట్‌లో తాళపత్రగ్రంథము పేరు ‘బుక్ ఆఫ్ డెత్’ (Book of Death) మరణించిన రోజులలో చదువుతారు అసలు ఆత్మ ఎక్కడికి వెళ్లుతుంది. 14 రోజుల పాటు చాల నరకయాతన అనుభవిస్తుంది. ఆత్మ జీవి మరణించినది అని మనము ఏడుస్తుంటే మనల్ని ఓదార్చాలని ఆత్మ పరితపిస్తుంది.
కాని అప్పటికే మానవ సంబంధాలు తెగిపోతాయి. మనకు దగ్గరగా రావాలని ఆత్మ క్షోభిస్తుంది. కాని రాలేదు. చివరకు 49 రోజుల వరకు లౌకిక ప్రపంచమును అది గమనిస్తూ ఉంటుంది. ఆత్మ ఎక్కడికి వెళ్లాలి అని ఆలోచిస్తూంటుంది. పూర్వజన్మ జ్ఞాపకాలు రకరకాల జన్మల గురించి నెమరు వేసుకుంటుంది. ఆశ్రయించే పదార్ధము కోసము వెతుకులాట ప్రారంభిస్తుంది. ఆత్మ గందర గోళపరిస్థితిలో ఉంటుంది. పాపాలు చేసిన వాళ్లు నరకానికి మంచి చేసిన వాళ్లు స్వర్గానికి వెళతారు. నరకానికి వెళ్ళేవాళ్లు 14 రోజులపాటు నరక మార్గములో పయనిస్తారు. నరకానికి 86 యోజనాల దూరము (లేక) 7లక్షల కిలో మీటర్ల దూరము వెళ్లవలసి వస్తుంది.
ఈ నరక మార్గములో నీళ్లు దొరకక సింహములు, పులులు, పాములు ఆత్మకి అడ్డుపడుతుంటారు విషజంతువులను తప్పించుకొని వెళ్లడం వాటితో చాల బాధలు అనుభవిస్తుంటారు. 16 యమనగరాలు కనబడతాయి. వైతరణి నది (మొట్టమొదటగా) కనబడును. దానిలో మంటలు, పొగలు, జంతువులు ఉంటాయి.
దానిలో కొన్ని శిక్షలు నరకయాతన అనుభవిస్తుంటారు. స్వర్గము, నరకమునకు 7 దార్లు 7 లక్షల కిలోమాటర్ల పయనము. పాపాలను బట్టి నరకంలో శిక్షలు ఆత్మను జంతువులు గాయపరుస్తాయి. సౌత్అఫ్రిక(South Africa) లో చాల విచిత్రమై ఆచారాలు ఉంటాయి. జీవి శరీరమును గుడ్డలు కట్టి కొండల దగ్గర గుహలలో గట్టుల దగ్గర దాచిపెడ్తారు. తరువాత రోజులలో బందువులందరు చనిపోయిన వాళ్ల గురించి గుట్టల దగ్గర ప్రసంగిస్తారు. ప్రసగించి పార్ధివ తీసి తిరుగుతారు. మళ్లి 4,5 గుడ్డలు కట్టి గుట్టల దగ్గర పెడతారు. జీవితో అవినావభావ సంబంధము కలిగి ఉంటారు. అప్పుడు ఆత్మలు శాంతిస్తాయి. అని వారి విశ్వాసము. ఆత్మ నరకము శిక్షలు అన్ని అనుభవిస్తుంది. 365 రోజుల తరువాత భూమితో సంబంధము తెగిపోతుంది.
మళ్లీ వాళ్ల కర్మను బట్టి ఆత్మ జీవిలోకి ప్రవేశిస్తుంది. కర్మసిద్ధాంతము ప్రకారము ఇదంత జరుగుతుంది. భూమి నుండి ఆత్మ ప్రవేశించేటప్పుడు జంతువుగా ఎన్ని దుఃఖాలు కలుగుతాయో ఆవిషయములన్నీ ఆలోచిస్తుంటుంది. భూమినుండి ఆత్మ బయలు దేరిన తరువాత బాధపడుతుంది. మళ్లీ గర్భంలోకి ప్రవేశించిన తరువాత కూడా కష్టము పడుతుంది. జీవి తరువాత భూమి మీదకు వచ్చిన తరువాత కూడా మానవునికి కష్టాలే.
మానవ జీవితము ఎందుకు ఉత్తమమైనది అంటే జంతుజన్మకంటే నయము కాబట్టి. భూలోకములో మానవులు చేసే తప్పులు పైలోకంలో శిక్షపడక తప్పదు. సర్పదర్శనం కూడా జరుగును. అంధకూపం, కుంభీపాకం, క్రిమిభోజనం మొదలగు ఇలాంటి శిక్షలు తప్పకుండా అనుభవించవలెను. మరికొంతమంది ప్రమాదంలో చనిపోయినతరువాత కొన్ని గంటలలోనే ఆత్మ గర్భములోపలకి ప్రవేశిస్తుంది. ఇది అతి తక్కువగా జరుగుతుంది. అందువలనే జగద్గురు ఆదిశంకరాచార్యులు అన్నారు.
పునరపి జననం పునరపి మరణం భగవద్గీతలో వివరించినారు. అందువల్లె పాపములు చేసినచో సర్పదోషరూపములో కూడా అన్నారు. శ్రీకృష్ణుడు పీడించును. ఈ సర్పదోషములు జన్మజన్మాంతరములు పీడించును. సర్పములు వధించుట వల్ల కూడా సర్పదోషము కల్గును. అందుకు పరిహారములు చేసి నాగేంద్రస్వామి అనుగ్రహము పొందవలెను.
పితృతీర్థం అంటే?
భూలోకంలో మానవులు చేసే తప్పులకు పై లోకంలో శిక్ష తప్పదు మానవులు 28 నరకాలలో శిక్షింపబడుతారు. ఒక్కొక్క నరకంలో బ్రాహ్మణులను, భక్తులను, సన్యాసులను వధించినవారు ఈ నరకానికి వెళ్లుతారు. ఈ నరకము పాములు, తేళ్లు, పులులు ఎలుగుబంట్లు, తేళ్లు, క్రిమికీటకాదులతో నిండి ఉంటుంది. ఇలాగే అంధతామిశ్రం అనే నరకంలో భార్యభర్తలో ఎవరు ఎవరిని మోసం చేసినా ఈ నరకానికి వెళ్లుతారు, ఇక్కడ యమభటులు పాపం చేసిన వాళ్లను తాళ్లతో కట్టేస్తారు.
ఆహారం కోసం పశుపక్ష్యాదులను వధించేవాళ్లు ఆ జంతువుల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు బాగా మరిగే నూనెలో ఉంచుతారు. ఈ నరకాన్ని కుంభీపాకం లేక పితృతీర్థం అంటారు. పాపము చేసిన వారు పుణ్యలోకాలకు పోకుండా అడ్డగించి ప్రవహించేనది వైతరణి అది ఒక లోకం, క్రిమికీటములను తినిపించటం వాటిచే కరిపించడం చేస్తే ఆ నరకమును క్రిమిభోజనం (లేక) కృమిభోజనం (లేక) క్రిమిశం అని అంటారు నీటి అడుగు భాగాన ఉండే నరకాలలో ఉండే నరకం తాల.
ఇలాగే ప్రాణ రోధ, మహాజ్వాల, మహారౌరవం, రక్షోభక్షం, రోధం, గౌరవం, వజ్రకంటకసాలి, వాటరోధం, విలోహితం, శుచిముఖం, సందంశం, సారయేయాశనం, సూకరం, సూకరముఖం, స్వభోజనం, అంధతామిశ్రం, అప్రతిష్ఠం, అప్రాచీ, కాలసూత్రం, దారుణం, పరావర్తనకం, లవణం, లాలాభక్షం. పైన రకాలతోపాటు పుత్తు అనే నరకం కూడా కలదు. సంతానము లేని వాళ్లు ఈ నరకానికి వెళ్లుతారు అని ప్రయాణం. దీనినుంచి రక్షించేవాడే పుత్రుడు రస, క్షేత్రజం, దత్తకృతిమ, గూఢాత్పన్న, అపవిద్ద, కానీన, సహోఢ, క్రీతక, పౌనర్భవ, స్వయందత్త, శౌద్ర (పారశవ) భేదాలతో కొడుకులు పన్నెండురకాలు.
మానవుడు జన్మించిన తరువాత పాపపు కర్మలు చేసిన తరువాత మనిషి మరణించిన పిమ్మట ఆత్మ పైకివెళ్లి శిక్షింపబడును కాని శరీరానికి సంబంధం లేదు. శరీరము శిక్షించబడాలి అంటే, జన్మ ఎత్తవలసినదే. జన్మ ఎత్తిన తరువాత శరీరము శిక్షింప బడును. ఇదే పూర్వ జన్మలో ఉండే కర్మల ఫలితము శరీరము అనుభవిస్తుంది. శిక్షలో మిగులు భాగము ఆత్మ కూడా అనుభవిస్తుంది. అందువల్లే పూర్వజన్మలో ఉండే కర్మల ఫలితములు ఆధారంగానే జాతకంలో గ్రహాలు ఏర్పడి ప్రతికూల అనుకూల ఫలితములు ఏర్పడుతాయి.
పూర్వజన్మలో ఉండే కర్మల ఫలితాల ఆధారంగానే గ్రహాలు మానవున్ని పీడింపబడుతాయి. సర్పమును చంపడంవల్ల అని, పుట్టలు త్రవ్వటంవల్ల కాక మానవుడు పూర్వజన్మలో ఉండే కర్మల ఆధారంగా గ్రహాలు సర్పరూపంలో పీడిస్తాయి. కేవలం సర్పవధ వల్లే కాకుండా. కర్మలు సర్పరూపంలో ఉంటాయి. వంశానుగత కర్మలు సర్పదోషరూపంలో పీడిస్తాయి. కొంతమంది అనుకొంటారు. సర్పమును వధించటం వల్లే సర్పదోషము కలుగుతుంది. అనుకుంటారు. అదికాదు పూర్వజన్మ కర్మలవల్ల కూడా గ్రహములు సర్పరూపంలో పీడిస్తాయి. జన్మజాతకంలో కాలసర్పయోగం, సర్పయోగములు ఏర్పడుతాయి.
పితృతర్పణములు చేయాల్సిందే..
ఎప్పుడైతే ప్రాణి మరణిస్తాడో వారి ప్రతి అంగము నిర్వీర్యం అయిపోతుంది. శరీరంలో ప్రతి అవయవము నిశ్చేష్టమైపోతాయి. ఇంద్రియములు, గ్రహణశక్తులు క్రమక్రమంగా నశించిపోతాయి. ప్రాణము, అపానము, సమానము, వాటి ఉదానము, వ్యానము అయిన పంచవేద ప్రాణవాయువులు విడిపోయి వాటి స్థానములోకి వెళ్లిపోతాయి. ఈ విధంగా అపానము దానవాయువు తారతమ్యములు ఏర్పడటం వల్ల ప్రాణవాయువుకి అవరోధం ఏర్పడుతుంది. ఈ అవస్థనే మనం మృత్యువు అంటాం.
అందువల్లే పితృతర్పణములు చేయాలి. పితృశ్రార్ధముల వలన వారు సంతుష్టులౌతారు. శ్రద్ధతో చేసేది శ్రార్థము. పితృదేవతలకు వారి వారి ఇష్టమైన భోజన పదార్థములను, బ్రాహ్మణులకు శ్రద్ధపూర్వకముగా సమర్పించి బ్రాహ్మణుల ఆశ్శీసులు పొందవలెను. బ్రాహ్మణులు భుజింపజేసిన భోజనం సూక్ష్మరూపంలో అత్యంత విస్తృతమైపోయి లోకాలోకాలను దాటి స్వర్గాన్ని చేరుతుంది.
పంచమహాభూతల కలయిక వలన భూమండలములోకి రావటమే జన్మము మరియు దాని నుండి విముక్తుడై లోకాంతర గమనము చేయడాన్నే ‘మృత్యువు’ అందురు. ఈ స్థూలదేహాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మలోకి వెళ్లిపోతుందో అప్పుడు కూడా అక్కడ 17 తత్వములతో ఉన్న సూక్ష్మశరీరముతో జీవాత్మకు సంబంధం ఉంటుంది.
వాక్కు మొదలైన పంచకర్మేంద్రియాలు, శ్రవణాది పంచ జ్ఞానేంద్రియాలు, పంచప్రాణులు, అకాశం మొదలైనటువంటి పంచమహాభూతాలు, మనస్సు, బుద్ది, చితము, అహంకారాత్మకమైన అంతఃకరణలు, చతుష్టయము మరియు ఆవిద్య, కామకర్మలు ఈ 27 తత్వాతలో నిర్మితమైనటువంటి ఈ దేహము స్థూలముగా పంచమహాభూతాలు, స్థూలమైనటువంటి కర్మేంద్రియాలను విడిచిపెట్టి మిగిలిన 17 తత్వాలతో తయారు చేయబడిన ఈ సూక్ష్మశరీరము ఎన్నో శాపములకు గురి అవుతుంది. మాత పితృల, గురువు, దేవుడు, పితృదేవతలు, బ్రాహ్మణుల, వివిధ పశుపక్ష్యాది, సర్పముల శాపముల వలన శరీరరమునకు రోగములు, మానసిక సంఘర్షణలు ఏర్పడి శరీరము పాడు అయిపోయి ఆత్మ శరీరమును విడిచి జీవాత్మ, పరమాత్మలో కలుస్తుంది.