Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి..!

ఈ రోజు (శుక్రవారం, నవంబర్ 22, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి..!

Updated On : November 21, 2024 / 7:09 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర కార్తీక మాస బహుళ సప్తమి: సా6:07, ఆశ్రేష సా5:10, శుక్రవారము ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు. 

మేష రాశి : అనుకోని ప్రయాణములు, ధనలాభములు, వ్యాపారంలో విభేదములు, కోర్టు సమస్యలు, చికాకులు, ఆరోగ్యము కుదుట పడుతుంది, స్త్రీలతో గొడవలు, విమర్శలు, న్యాయనిపుణులను సంప్రదిస్తారు, వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు కలుగుతాయి, దత్తాత్రేయ పారాయణము చేయటం వల్ల శుభం కలుగుతుంది.

వృషభ రాశి: ప్రయాణములలో ప్రమాదములు, ఆకస్మిక ధనలాభము, శుభకార్యనిర్వాహణ, వాగ్దానములు నెరవేరటం, ఆర్ధిక నష్టాన్ని పూడ్చుకుంటారు, అగ్రిమెట్లు ఫలిస్తాయి, స్థిర ఆదాయం తగ్గుతుంది, అవివాహితులకు శుభవార్తలు: విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభం కలుగును.

మిథున రాశి: స్థాన భ్రంశము, కార్యరంగంలో ప్రతికూలత, శత్రువృద్ధి, కుటుంబంలో సమస్యలు, అధిక ఆదాయం, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగములలో అభివృద్ధి. అన్నింటా విజయం, మంచి నిర్ణయములు తీసుకోవడం, అధికారుల ఒత్తిడి, కోర్టు వివాదములు, నిరాశ కలుగుతుంది: శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన వలన శుభ ఫలితములు కలుగుతాయి.

కర్కాటక రాశి: కోపం పెరగడం, అవసరాలు తీరడం, ఉన్న విషయములలో జుగ్రత్త అవసరము, రుణ బాధలు తగ్గడం, బంధుమిత్రులతో జాగ్రత్త అవసరము, వృత్తి వ్యాపార రంగములలో మంచినిర్ణయములు తీసుకుంటారు, మంచి మిత్రులతో కలయిక. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

సింహ రాశి: ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారములలో శ్రమకు తగిన ఫలితములు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువకావడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆర్థికంగా పొదుపు పాటించడం అవసరము. వ్యక్తిగతంగా ఈ రోజు మీ కోపాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది, ప్రయూణముల వలన లాభములు కలుగుతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరము.

కన్యా రాశి: ఆరోగ్యపరంగా ఈ రోజు కొన్ని సమస్యలు వస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి అదనపు ఆదాయవనరుల కోసం ప్రయత్నిస్తారు. వృత్తి వ్యాపారములకు సంబంధించిన కీలక నిర్ణములు తీసుకునే విషయంలో అనిశ్చితి మనస్తత్వం కారణంగా చెడ్డపేరు వచ్చే ప్రముదం ఉంది. స్థిరమైన బుద్ధితో ప్రశాంతమైన మనసుతో పని చేసి ఖ్యాతి తగ్గకుండా చూసుకోండి. హనుమాన్ చాలిసా పారాయణముతో మెరుగైన ఫలితములు ఉంటాయి.

తులా రాశి: ఈ రోజు శుభకరంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచిరోజు. బాల్యమిత్రులను కలుసుకొని సరదాగా గడుపుతారు. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి. మీతల్లి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము, కోర్టు సమస్యలు, ఆస్తి వ్యవహారంలో జాగ్రత వహించండి. కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా జగ్రత్త పడాలి. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి: అపకీర్తి, స్థానచలనము, మానసిక ఆందోళనలు, అగౌరవము, అధికారులు ఒత్తిడి, వ్యాపారంలో జాయింటుదారుల మధ్య గొడవలు, ధన ఆదాయం పెరగడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, నవగ్రహములకు ప్రదక్షిణ చేయడం వల్ల మంచి జరుగుతుంది

ధనస్సు రాశి: శుభవార్తలు, విందుభోజనం నూతన లాభములు, ప్రముఖ వ్యక్తుల కలయిక ద్వారా అధిక లాభములు, స్త్రీలకు ఉన్నతమైన ఆలోచనలు, విదేశీయాన ఏర్పాట్లు జరగడం, సరియైన సమయంలో సరియైన నిర్గములు తీసుకోవడం. రాజ రాజేశ్వరి అమ్మవారి ఆరాధన వల్ల శుభ ఫలితములు వస్తాయి.

మకర రాశి: ఉద్యోగ వ్యాపార‌ముల‌లో మార్పులు, కార్య‌రంగంలో ప్ర‌తికూల‌త‌, బంధు, మిత్ర‌, పుత్ర విరోధ‌ములు, కుటుంబ స‌మ‌స్య‌లు, అన్య‌స్థ‌ల నివాసము. ఉద్యోగంలో భ‌యము. శ‌త్రు వృద్ధి, స్త్రీల మూలంగా ఇబ్బందులు. అరాచ‌కం. నిద్ర‌లేమీ, అకార‌ణ‌వైర‌ము, క‌ల‌హాములు, బంధు మిత్రుల‌తో జాగ్ర‌త్త అవ‌స‌రం. ల‌క్ష్మీ దేవీ ఆరాధ‌న చేయ‌డం వ‌ల్ల శుభ‌ఫ‌లిత‌ములు క‌లుగును. 

కుంభ రాశి: నరాల బలహీనత, మానసిక ప్రశాంత లేకపోవడం, సరియైన సమయంలో నిర్ణయము తీసుకోలేకపోవడం, ధననష్టము, అకారణ వైరము, అనారోగ్యము గురించి ధనము ఖర్చుకోవడం, విరోధములు, కోర్టు సమస్యలు, వ్యాపారములో చికాకులు, ఊహించని నష్టములు, సోమరితనము అధికం కావడం, ప్రయాణముల్లో ప్రమాదములు – శ్రీవిష్ణు స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

మీనా రాశి: నూతన విషయములలో అభివృద్ధి, కీలక అంశములపై చర్చలు, ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించటం, ధనధాన్యలాభములు, అన్య స్త్రీ పరిచయము, కీర్తి ప్రతిష్టలు కలగడం, గౌరవ సన్మానములు పొందడం, నగలు, విలువైన వస్త్రములు కోనుగోలు చేయడం, అభివృద్ధి కలగడం. అమ్మవారి ఆరాధన వలన శుభం కలుగును.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956