Today Horoscope
Horoscope Today: నవగ్రహాల్లో ఐదు పెడసరంగా ప్రవర్తిస్తున్నాయి. పరస్పరం సంపత్తి లేకపోవడంతో.. ప్రధాన గ్రహాలు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రవి, గురువులు అదనపు బలాన్ని సంతరించుకోవడం కొన్ని రాశులకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. వృషభం, సింహం, కన్య, మకరం రాశులు విశేష ఫలితాలు అందుకుంటారు.
మేషం: ఆత్మబలం ద్విగుణీకృతం అవుతుంది. పట్టుదలతో కార్యాలు చక్కబెడతారు. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.
వృషభం: ఏకాదశంలో ఉన్న నాలుగు గ్రహాల కన్నా… పన్నెండింట ఉన్న రవి ఈ రోజు మిమ్మల్ని నడిపిస్తాడు. పలుకుబడి పెరుగుతుంది. దక్షతతో వ్యవహరిస్తారు. సోదరులతో వివాదాలు సమసిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దైవాన్ని ప్రార్థించండి.
మిథునం: రచ్చ గెలిచినా.. ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ కలహాలకు కుజుడు ఆజ్యం పోస్తున్నాడు. సంయమనంతో మాట్లాడండి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
కర్కాటకం: అదృష్టం తలుపు తడుతుంది. రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. భోజన సౌఖ్యం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
సింహం: చాలారోజులుగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి మంచి వార్త వింటారు. మానసికంగా ధైర్యాన్ని పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సూర్యారాధన శుభప్రదం.
కన్య: అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. నలుగురి సాయం పొందుతారు. బంధువుల రాకతో ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యంలో మంచి మార్పు వస్తుంది. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
తుల: ఆరోగ్య విషయమై ఆందోళనలు నెలకొంటాయి. ముగిసిపోయింది అనుకున్న సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. మిత్రులే శత్రువులుగా మారుతారు. మాట తీరు జాగ్రత్త. ఎవరినీ నిందించకండి. సంయమనం పాటించడం అవసరం. శివారాధన మేలు చేస్తుంది.
వృశ్చికం: కీలక విషయాల్లో ముందడుగు పడుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. సోదరుల వల్ల లబ్ధి చేకూరుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. హనుమాన్ చాలీసా పఠించండి.
ధనుస్సు: శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. అదృష్టం వరించడానికి సిద్ధంగా ఉంది. మీనమేషాలు లెక్కించకండి. ఆరోగ్యంలో పురోగతి ఉంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
మకరం: కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు తేలికైన పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. రామాలయాన్ని సందర్శించండి.
కుంభం: కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ఒత్తిళ్లు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఏమరుపాటు తగదు. రుణ ప్రయత్నాలు విఫలం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.
మీనం: మనసు స్థిమితంగ ఉండదు. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. సంయమనం పాటించడం అవసరం. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.