Horoscope Today : ఈ మూడు రాశులకు మహర్దశ..!

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దత్త స్తోత్రాలు పఠించండి.

Horoscope Today : స్వనక్షత్రంపై ఉన్న చంద్రుడు ఈరోజు అనుకూల ఫలితాలు అనుగ్రహిస్తాడు. అంశరీత్యా నీచపడ్డ రవి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. వకృత్వం పొందిన బుధ, శుక్రులు పరీక్షిస్తారు. మిగతా గ్రహాలు ఆయా రాశుల నుంచి పొందిన స్థానాన్ని బట్టి ఫలితాలు ఇస్తాయి. వృషభం, కన్య, మకర రాశులకు ఈ రోజు మహర్దశ పడుతుంది. మిగతా రాశుల వారికి మిశ్రమంగా ఉంటుంది.

Aries

మేషం: ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో రాబడి ఉండదు. అనుకూల స్థానచలన సూచన. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Taurus

వృషభం: అనుకోని అదృష్టం తలుపు తడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. భూ లావాదేవీల్లో లాభం అందుకుంటారు. ఆత్మీయులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం. శివాలయాన్ని సందర్శించండి.

Gemini

మిథునం: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దత్త స్తోత్రాలు పఠించండి.

Cancer

కర్కాటకం: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిర చరాస్తుల మూలంగా డబ్బు చేతికి అందుతుంది. విందులకు హాజరవుతారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

Leo

సింహం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. బంధువర్గం, స్నేహితుల సూచనలను పాటించి, సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

Virgo

కన్య: శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ, రాజకీయ పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన మేలు చేస్తుంది.

Libra

తుల: తలపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఇంటా, బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. హనుమాన్‌ చాలీసా పఠించండి.

Scorpio

వృశ్చికం: సంతృప్తికర ఫలితాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. శుభవార్త వింటారు. వినాయకుడి గుడికి వెళ్లండి.

Sagittarisu

ధనుస్సు: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. లక్ష్మీధ్యానం శుభప్రదం.

Capricorn

మకరం: ఈ రోజు గ్రహస్థితి సత్ఫలితాలనిస్తుంది. సంగీత, సాహిత్య, కళాకారులకు చక్కటి అవకాశం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. రామాలయాన్ని సందర్శించండి.

Aquarius

కుంభం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. సమస్యలు తీరుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

Pisces

మీనం: ఈ రోజు మిశ్రమంగా ఉంది. ప్రారంభించిన పనులలో శ్రమ ఎక్కువ అవుతుంది. ఆలోచనలతో సతమతమవుతారు. పట్టువిడుపులు ప్రదర్శించండి. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.

(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)

టి. భుజంగరామ శర్మ
77022 86008

Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్‌ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.