Horoscope Today : ఈ రెండు రాశులకు పండుగే.. నక్కతోక తొక్కినట్టే.. మీ మాటే శాసనం..!

Horoscope Today
Horoscope Today : పది రోజులుగా అస్తంగతుడై ఉన్న పరిపూర్ణ శుభగ్రహం శుక్రుడు ఈ రోజు మళ్లీ ఉదయిస్తున్నాడు. మూఢం ముగించుకున్న శుక్రుడు తన సొంత రాశులకు, స్వ నక్షత్రాలకు మేలు చేస్తాడు. ఉచ్ఛస్థితిలో ఉన్న శుక్రుడు పరమోచ్ఛ ఫలితాలు అందిస్తాడు.
Ariesమేషం: చంద్రబలం నడిపిస్తుంది. ఆర్థికంగా చక్కటి అవకాశాలు అందుకుంటారు. మాటతీరు సరళంగా ఉండేలా జాగ్రత్తపడటం అవసరం. కుటుంబంలో సంతోషంగా వాతావరణం ఉంటుంది. సమస్యలను అధిగమిస్తారు. లక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.

Taurus
వృషభం: ఈ రోజు అదృష్టం కలిసివస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. అలంకరణపై ఆసక్తి కనబరుస్తారు. పలుకుబడి పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి పనులు చేపడతారు. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Gemini
మిథునం: ఉద్యోగులకు మేలు జరుగుతుంది. పదోన్నతి అవకాశం. అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆర్థికంగా మిశ్రమ వాతావరణం ఉంటుంది. మంచి పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. శివాలయాన్ని సందర్శించండి.

Cancer
కర్కాటకం: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సమయపాలన పాటించండి. సహోద్యోగులతో వివాదాలు తలెత్తుతాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి. రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Leo
సింహం: కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. తోబుట్టువుల సహకారం లభిస్తుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గణపతి ఆలయాన్ని సందర్శించండి.

Virgo
కన్య: ఆర్థికంగా ఒడుదొడుకులు ఉంటాయి. ఆన్‌లైన్ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. శత్రువులపై పై చేయి సాధిస్తారు. బంధువుల రాకతో ఇల్లంతా సందడిగా మారుతుంది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి. ఆరోగ్యంగా ఉంటారు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Libra
తుల: స్త్రీ మూలకంగా ధన ప్రాప్తి ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు, వినోదాలకు హాజరవుతారు. రోజంతా సంతోషంగా గడుపుతారు. పెద్దలతో మాట్లాడేటప్పుడు అతిగా వ్యవహరించకండి. శుభవార్త వింటారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

Scorpio
వృశ్చికం: పిల్లల విషయంలో ఆందోళనగా ఉంటారు. సమయపాలన పాటించడం అవసరం. ఆస్తుల కొనుగోలు, విక్రయం గురించి కుటుంబంతో చర్చిస్తారు. పెద్దల సలహాలు వినడం అవసరం. సద్గురువును ఆశ్రయిస్తారు. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Sagittarisu
ధనుస్సు: తోబుట్టువు నుంచి కీలక సమాచారం అందుతుంది. కార్యసాధనపై దృష్టి సారిస్తారు. శుక్రుడు ఉదయించడంతో కొత్త దారులు తెరుచుకుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. హనుమాన్ చాలీసా పఠించండి.

Capricorn
మకరం: ఇంట్లో మేలైన వాతావరణం ఉంటుంది. కీలక సమావేశాలకు హాజరవుతారు. ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనిలో కదలిక వస్తుంది. త్వరగా పూర్తవుతుందన్న నమ్మకం కుదురుతుంది. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
కుంభం: కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి. స్నేహితులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో కలహ సూచన. సమయపాలన అవసరం. రామాలయాన్ని సందర్శించండి.
మీనం: మనసు గందరగోళంగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. ధైర్యం సరిపోదు. నెగెటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి. సంయమనం పాటించడం చాలా ముఖ్యం. సాయంత్రానికి పరిస్థితి కొద్దిగా సద్దుమణుగుతుంది. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.