Kaal Sarp Dosh
Kaal Sarp Dosh: రాహుకేతువుల మధ్య సప్తగ్రహములు బంధించి ఉంటే దానిని కాలసర్ప యోగము అంటారు. కాలసర్పదోషము ఉన్న వారు రాహువు మహర్దశలో రాహు అంతర్దశ జరుగుతున్నప్పుడు భ్రమరాంభికాష్టకము, దుర్గాస్తోత్రములు, రాజరాజేశ్వరి కవచము, సంకటనాశన గణేషస్తోత్రము, హనమద్బడబానల స్తోత్రములు శ్రీమానసాదేవి నాగస్తోత్రములు, రాహుజపం, రాహుస్తోత్రములు చదవాలి.
రాహువులో గురువు అంతర్దశ జరుగుతున్నప్పుడు కాలసర్పజాతకులు గురువు జపం, గురువుకి సంబంధించిన వేదోక్తమంత్రాలు, శ్లోకములు, పాదరస శివలింగమునకు శివాభిషేకములు, శివునికి సర్పపాశుపతాస్త్ర అభిషేకములు మన్యుసూక్తపారాయణములు దత్తాత్రేయ స్తోత్రములు, షిర్డిసాయి బాబా అష్టోత్తర శతనామావళి చదవాలి. (Kaal Sarp Dosh)
రాహువులో శని అంతర్దశ జరుగుచున్నప్పుడు కాలసర్ప జాతకులు శనిజపం, శని మంత్రములు, శ్లోకములు, స్తోత్రములు, మహన్యాస రుద్రాభిషేకములు, శివపంచాక్షరి జపం, శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రపారాయణము. సర్ప అష్టోత్తరశతనామావళి చదవాలి.
రాహువులో బుధ అంతర్దశ జరుగుచున్నప్పుడు కాలసర్ప జాతకులు బుధ జపం, బుధుడు వేదోక్త మంత్రములు, శ్లోకములు, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము శ్రీమానసాదేవి స్తోత్రము యుధిష్టర కృతాదుర్గ స్తవనమ్ చదవాలి.
రాహువులో కేతువు అంతర్దశ జరుగుతున్నప్పుడు కాలసర్పజాతకులు రాహువు, కేతువుల జపము కవచస్తోత్రములు, మూలమంత్రములు, దుర్గా, గణపతి అష్టోత్తర శతనామావళి, గణపతి సూక్తము రుద్ర కవచమ్, మన్యుసూక్తమ్, సర్పసూక్తములు, శ్రీమహిషాసుర మర్దినీ స్తోత్రము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్, నాగదోష నివారణ జపమంత్రములు, శ్రీసుబ్రహ్మణ్య అష్టకము చదవాలి.
రాహువులో శుక్ర అంతర్దశ జరుగుతున్నప్పుడు కాలసర్పజాతకులు శుక్ర జపం, శుక్రుని వేదోక్త మంత్రములు, స్తోత్రములు కనకధార స్తోత్రము ధనంజయ కృత శ్రీదుర్గా స్తుతి, నాగేశ్వర స్తుతి, శ్రీదుర్గాదేవి బీజాక్షర స్తోత్రములు, గకార గణపతి అష్టోత్తర శతనామావళి, భ్రమరాంభిక అష్టకము, శ్రీసుబ్రహ్మణ్య కరావలంబాష్టకము చదవాలి.
రాహువులో రవి అంతర్దశ జరుగుతున్నప్పుడు కాల సర్పజాతకులు రవిజపం, రవి వేదోక్త మంత్రములు, స్తోత్రములు సూర్యనమస్కారములు, ఆదిత్య హృదయము, నాగ అష్టోత్తర శతనామావళి మానసాదేవి స్తోత్రము, సర్పసూక్తము, రాజరాజేశ్వరి కవచము, రుద్రాభిషేకములు, శ్రీవినాయక బీజాక్షర అష్టోత్తర శతనామావళి చదవాలి.
రాహువులోని చంద్ర అంతర్ధశయందు జరుగుచున్నప్పుడు కాలసర్పజాతకులు చంద్ర జపం, చంద్రుడుకు సంబంధించిన వేదోక్త మంత్రములు, స్తోత్రములు వివిధగణపతుల అష్టోత్తర శతనామావళి శ్రీ మానసాదేవి నాగస్తోత్రము, మన్యుసూక్తం, శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య భుజంగస్తోత్రమ్, ధనంజయ కృత శ్రీదుర్గాస్తుతి, శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రపారాయణము గణపతి సూక్తమ్ చదవాలి.
రాహువులోని కుజ అంతర్దశలో జరుగుతున్నప్పుడు కాలసర్పజాతకులు కుజజపం, కుజుడుకు సంబంధించిన వేదోక్త మంత్రములు, స్తోత్రములు, శ్రీసుబ్ర హ్మణ్య సహస్రనామావళి, శ్రీసుబ్రహ్మణ్య స్తోత్రము, మన్యుసూక్తం, బ్రమరాంభికాష్ట కము, మానసాదేవి నాగస్తోత్రము, శ్రీరుద్రకవచమ్, హనుమద్బడబానల స్తోత్రము, శ్రీసుబ్రహ్మణ్యకవచమ్, శివాభిషేకం సర్పసూక్తం, గణపతి సూక్తమ్, భ్రమరాంభి కాష్టకమ్, శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రమం, కనకధారాస్తోత్రమ్. శ్రీసుబ్రహ్మణ్య అష్టకము పఠించాలి.
పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Ph: 9849280956, 9515900956