×
Ad

Karthika Masam: కార్తీక మాసం.. 24వ రోజు.. అప్పుల సమస్య నుంచి బయటపడాలంటే ఈ దీపం వెలిగించాల్సిందే..!

గజలక్ష్మి కామాక్షి దీపం, అష్టలక్ష్మి కామాక్షి దీపం, కంచి కామాక్షి దీపం.. దేన్నైనా వెలిగించుకోవచ్చు.

Karthika Masam: కార్తీక మాసంలో 24వ రోజుకున్న ప్రాధాన్యత ఏంటో, 24వ రోజు నవంబర్ 14 శుక్రవారం రోజున సమస్త సంపదలు లభించాలంటే, అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలంటే ఎలాంటి శక్తిమంతమైన అదృష్ట దీపాన్ని వెలిగించాలో తెలుసుకుందాం.

కార్తీక మాసం 24వ రోజున ప్రధానంగా అందరూ చేయల్సింది ఏంటంటే.. గణపతి శోడస నామాలు చదువుకుంటూ స్నానం చేయాలి. 16 నామాలు చదువుకుంటూ స్నానం చేస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత శివుడికి, విష్ణువుకి ఎండు ఖర్జారాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా వివాహ సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఎండు ఖర్జూరాలు నైవేద్యంగా పెట్టాలి.

అలాగే కార్తీక మాసం 24వ రోజున శుక్రవారం అయ్యింది కాబట్టి అష్టఐశ్వర్యాలు కలగాలంటే, సమస్త భోగాలు లభించాలంటే కామాక్షి దీపాన్ని ఇంట్లో వెలిగించుకోవాలి. నవంబర్ 14న శుక్రవారం ఏ ఇంట్లో అయితే కామాక్షి దీపం పెడతారో ఆ ఇంట్లో అష్టలక్ష్ములు ఆనంద తాండవం చేస్తారు. కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం వల్ల సర్వ సంపదలు చేకూరతాయి.

గజలక్ష్మి కామాక్షి దీపం, అష్టలక్ష్మి కామాక్షి దీపం, కంచి కామాక్షి దీపం.. దేన్నైనా వెలిగించుకోవచ్చు. కామాక్షి దీపాన్ని రెండు రకాలుగా వెలిగిస్తారు. పూజ గదిలో ఒక రాగి లేదా ఇత్తడి పళ్లెం ఏర్పాటు చేసుకుని దాని మీద మూడు చోట్ల గంధం బొట్లు, మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి.. రాగి పళ్లెంలో సవ్య స్వస్తిక్ గుర్తు తడి గంధంతో వేయాలి. పళ్లెంలో మూడు గుప్పెళ్ల బియ్యం పోయాలి. అందులు కొద్దిగా పసుపు, కుంకుమ వేయాలి. 8 దిక్కుల్లో (తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి) 8 తమలపాకులు ఉంచాలి. ఆ 8 తమలపాకులకు మధ్యలో 9వ తమలపాకు ఉంచాలి. 9వ తమలపాకు మీద కూడా కొద్దిగా బియ్యం పోసి పసుపు, కుంకుమ వేసి.. 9వ తమలపాకు మీద ఉంచిన బియ్యం మీద కామాక్షి దీపం ప్రమిద ఉంచాలి. అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా విప్ప నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి ఏక హారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే కామాక్షి దీపం అంటారు.

కామాక్షి దీపానికి ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. దాని మీద బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. 8 దళాలున్న పద్మ ముగ్గు వేయాలి. ఆ తర్వాత పీట మీద రాగి పళ్లెం లేదా ఇత్తడి పళ్లెం ఉంచి కామాక్షి దీపం వెలిగించుకోవాలి. ఎందుకంటే అష్టదళ పద్మం ముగ్గు అంటే లక్షీదేవికి ఇష్టం. ఈ విధానం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గుతాయి. అప్పుల సమస్య నుంచి బయటపడొచ్చు. రావాల్సిన ధనం వస్తుంది.