×
Ad

Karthika Masam: అక్టోబర్ 22.. కార్తీక మాసం తొలి రోజు.. చేయాల్సిన పూజలు, దానాలు ఇవే..!

ఈ రెండు దానం ఇస్తే చాలా మంచిది. గ్రహ దోషాలు తొలగిపోతాయి, సమస్త శుభాలు చేకూరతాయి. తొలి రోజున తెల్లవారుజామున..

కార్తీక మాసం మొదటి రోజు.. అక్టోబర్ 22 బుధవారం.. తొలి రోజున ఎలాంటి పూజలు, ఏయే దానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో తెలుసుకుందాం. కార్తీక మాసంలో మొట్టమొదటి రోజును బలి పాడమ్యి అంటారు. ఈ మొట్టమొదటి రోజునే గో క్రీడనం చేయాలి. గోవర్దన పూజ చేయాలి అని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలిజేస్తున్నాయి.

తొలి రోజు బలి పాడ్యమి కాబట్టి అందరూ సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు మట్టి ప్రమిదల్లో నూనె పోసి దీపాలు వెలిగించేటప్పుడు బలి చక్రవర్తిని మనసులో స్మరించుకోవాలి. ఓం బలిరాజాయ నమ: అని మనసులో అనుకుంటూ దీపాలు వెలిగించాలి. అలాగే విష్ణుమూర్తిని కూడా స్మరించుకోవాలి. ఓం వామన రూపాయ శ్రీమహా విష్ణవే నమ: అని కూడా మనసులో స్మరించుకోండి.

బలి చక్రవర్తిని, వామన రూపంలో ఉన్న విష్ణువుని స్మరించుకుంటూ సాయంకాలం ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక మాసం తొలి రోజు గోక్రీడనం చేస్తారు. గోక్రీడనం అంటే గోవును పూజించడం అని అర్థం. గోవుల మధ్యలో ఉండటం అని అర్థం. దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే గోశాలకు వెళ్లి గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోవుకు ఆహారం తినిపించడం, గోవుకు ప్రదక్షణలు చేయడం చేయాలి. అలాగే కార్తీక మాసం తొలి రోజున మార్గపాలి ఉత్సవం అనే ప్రత్యేకమైన ఉత్సవం చేస్తారు. ఆవు, దూడ కలిసుంటే వాటికి ప్రదక్షణలు చేయటాన్నే మార్గపాలి ఉత్సవం అంటారు.

ఈ రెండు దానం చేస్తే చాలా మంచిది..

కార్తీక మాసం తొలి రోజున కంద, బచ్చలి.. ఈ రెండు దానం ఇస్తే చాలా మంచిది. గ్రహ దోషాలు తొలగిపోతాయి, సమస్త శుభాలు చేకూరతాయి. తొలి రోజున తెల్లవారుజామున కార్తీక స్నానం చేస్తే చాలా మంచిది. కార్తీక శుక్ల పాడ్యమి, కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో ఆఖరి రోజు అమావాస్య.. ఈ మూడు రోజుల్లో తెల్లవారుజామున కార్తీక స్నానం చేస్తే 30 రోజులు కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. సూర్యోదయానికి కనీసం అరగంట ముందు కార్తీక స్నానం చేయాలి. కార్తీక స్నానం చేసేటప్పుడు మొదటి రోజు గోవింద గోవింద గోవింద, పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష అనుకుంటూ కార్తీక దామోదర ప్రీత్యర్థం అని అనుకుంటూ స్నానం చేయాలి.

కార్తీక మాసం తొలిరోజు సమస్త శుభాలు చేకూరాలంటే అందరు కూడా కచ్చితంగా చేయాల్సిన పని దేవాలయానికి వెళ్లి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవాలి. శివాలయానికి వెళితే శివాలయంలో ఒక పెద్ద భరిణలో మట్టి ప్రమిదలు ఉంచి నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించి ఆ భరిణను శివాలయంలో ఉంటే ధ్వజ స్థంభానికి తాళ్ల సాయంతో వేలాడదీస్తారు. దాన్ని ఆకాశ దీపం అంటారు. కార్తీక మాసం తొలి రోజున ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి.

కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే నదికి వెళ్లి నదిలో కానీ చెరువులో కానీ బావి దగ్గర కానీ ఎక్కడ స్నానం చేస్తున్నా సరే.. గంగ గంగ గంగ అని అనుకుంటే గంగా స్నాన ఫలితాన్ని సిద్ధింపజేసువకచ్చు. స్నానం చేశాక రావి చెట్టు కింద కూర్చుని కార్తీక పురాణం చదివితే ఉత్తమ ఫలిలాలు కలుగుతాయి. కార్తీక మాసంలో తొలి రోజు కార్తీక శుక్ల పాడ్యమి బలి పాడ్యమి అదే విధంగా గోక్రీడనం. ఈ సందర్శంగా ఈ విధివిధానాలు పాటించాలి. శ్రీకృష్ణుడు తన చిటికన వేలు మీద గోవర్ధన గిరిని ఎత్తిన రోజు కార్తీక మాసం మొదటి రోజు. అందుకే ఈ మొదటి రోజు గోవర్ధన పూజ చేయలి.