Karthika Masam: తొందరగా గృహ యోగం సిద్ధింపజేసుకోవడానికి, పెద్ద మొత్తంలో ఉన్న రుణాల సమస్యల నుంచి బయటపడేందుకు, బ్యాంకు లోన్లు తొందరగా రావటానికి, రావాల్సిన ఆస్తులు తొందరగా రావటానికి, రియల్ ఎస్టేట్ లో అభివృద్ధి సాధించడానికి కార్తీక మాసంలో కందుల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో తెలుసుకుందాం.
కార్తీక మాసంలో ఏ రోజైనా సరే.. లేదా మంగళవారం రోజున.. కందుల దీపం వెలిగిస్తే పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడొచ్చు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు.. ఇలాంటివి కొనుక్కోవడానికి, అలాగే తొందరలోనే మంచి రేటుకి అమ్ముకోవడానికి కందుల దీపం బాగా సహకరిస్తుంది.
కందుల దీపాన్ని కార్తీక మంగళవారం ఎలా వెలిగించాలి అంటే..
కార్తీక మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు లేదా ఏదో ఒక మంగళవారం రోజున మీ పూజా మందిరంలో సుబ్రమణ్యేశ్వర స్వామి ఫోటోకి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత అక్కడ ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్లాలి. ఆ పీట మీద బియ్యపు పిండితో షట్కోణం (ఒక అప్పర్ ట్రయాంగిల్, ఒక లోయర్ ట్రయాంగిల్) ముగ్గు వేయాలి. సుబ్రమణ్య స్వామికి ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం. పీట మీద ఈ ముగ్గు వేసి, దానిపై రాగి లేదా ఇత్తడి పళ్లెం ఉంచాలి. ఆ పళ్లెంలో 5 చోట్ల గంధపు బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు రాగి పళ్లెంలో కందులు కుప్పలా పోయాలి. ఆ కందుల కుప్ప మీద పెద్ద మట్టి ప్రమిద ఉంచి, నువ్వుల నూనె పోసి, తొమ్మిది ఎరుపు ఒత్తులు (కుంకుమ పూసినవి) వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే కందుల దీపం అంటారు.