Maha Shivratri 2025
Maha Shivratri 2025 : పవిత్రమైన మహాశివరాత్రి పండుగ రాబోతోంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈ పర్వదినాన శివుని భక్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజున, శివుని భక్తులు స్వామివారిని ప్రసన్నం చేసుకునేందుకు అనేక పూజలు చేస్తుంటారు.
శివలింగానికి అభిషేకం, పూజ మొదలైన వాటిని వివిధ మార్గాల్లో చేస్తారు. శివుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనను పూజించేటప్పుడు తెల్లని పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, శివున్ని పూజించడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి.
తెల్లగా, అందంగా ఉండే ఒక పువ్వు ఉంది. కానీ, శివుడికి ఈ పువ్వును పూజలో సమర్పించరు. ఈ పువ్వును “కేతకి” అని పిలుస్తారు. కేతకి పువ్వులను మహాదేవుడికి ఎప్పుడూ ఎందుకు సమర్పించరు అనే దాని వెనుక ఒక పురాణం ఉంది. పూజ సమయంలో మనం వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పొరపాటున కూడా అలాంటి తప్పు చేయకూడదు. దాంతో శివుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
పురాణాల ప్రకారం.. ఒకానొక సమయంలో బ్రహ్మ, మహావిష్ణువుల మధ్య ఇద్దరిలో ఎవరు గొప్ప అనే వివాదం చెలరేగింది. బ్రహ్మదేవుడు తాను విశ్వ సృష్టికర్తనని, తానే గొప్పవాడినని చెప్పుకుంటున్నాడు. అలాగే, మహా విష్ణువు కూడా తాను విశ్వం మొత్తానికి రక్షకుడిగా ఉన్నతుడని చెప్పుకున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఒక పెద్ద ప్రకాశవంతమైన లింగం కనిపించింది. ఈ లింగం చివరను ముందుగా ఎవరు కనుగొంటారో వారు గొప్పవరని చెబుతారు.
Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ 24వ తేదీన ఖాతాల్లో రూ. 2వేలు పడవు.. వెంటనే ఈ 3 పనులు చేయండి!
బ్రహ్మ, విష్ణుకు మధ్య వివాదం :
పురాణాల ప్రకాం.. ఒకానొక సమయంలో బ్రహ్మ, మహావిష్ణువుల మధ్య ఇద్దరిలో ఎవరు గొప్ప అనే వివాదం చెలరేగింది. బ్రహ్మదేవుడు తాను విశ్వ సృష్టికర్తనని, తానే గొప్పవాడినని చెప్పుకుంటున్నాడు. అలాగే, మహా విష్ణువు కూడా తాను విశ్వం మొత్తానికి రక్షకుడిగా ఉన్నతుడని చెప్పుకున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఒక పెద్ద ప్రకాశవంతమైన లింగం కనిపించింది. ఈ లింగం చివరను ముందుగా ఎవరు కనుగొంటారో వారు గొప్పవరని చెబుతారు.
అందుకు బ్రహ్మ, విష్ణు కూడా ఏకాభిప్రాయంతో బయల్దేరారు. వారిద్దరూ శివలింగం చివరను కనుగొనడానికి వ్యతిరేక దిశల్లోకి వెళ్లారు. విష్ణుకి అంతం దొరకకపోవడంతో తిరిగి వచ్చాడు. బ్రహ్మదేవుడు కూడా విజయం సాధించలేదు.
కానీ, విష్ణు దగ్గరకు వచ్చి తాను పూర్తి చేశానంటూ చెప్పాడు. దీనికి సాక్షిగా ఆయన కేతకి పుష్పాన్ని పిలిచాడు. కేతకి పుష్పం కూడా బ్రహ్మ అబద్ధానికి మద్దతు ఇచ్చింది. బ్రహ్మా అబద్ధం చెప్పినప్పుడు, శివుడు స్వయంగా అక్కడ ప్రత్యక్షమై బ్రహ్మదేవున్ని మందలించాడు.
ఆ సమయంలో దేవతలంతా మహాదేవున్ని స్తుతించారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నేనే విశ్వానికి కారణం. సృష్టికర్తను అంటూ బోధించారు. బ్రహ్మ, విష్ణువును ఇద్దరినీ సృష్టించినది నేనే. తప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు శివుడు కేతకి పువ్వును శిక్షించారు. ఈ పువ్వును తన పూజలో సమర్పించారదని శపించారు. అందుకే శివుని పూజలో కేతకి పువ్వును ఎప్పుడూ సమర్పించరని చెబుతుంటారు.
శివునికి ఏది ఇష్టమంటే? :
వాస్తవానికి, శివునికి పూజ సమయంలో ప్రత్యేకమైన పువ్వుంటూ లేదు. మహాశివుడు తన భక్తులు సమర్పించే పాలు, ధాతుర, అంజూర పువ్వు లేదా అపరాజిత పువ్వును సమర్పిస్తే ఆయనకు చాలా ప్రియమైనది. దాంతోపాటు, శివునికి గులాబీ పువ్వును కూడా సమర్పించవచ్చు. గులాబీ పువ్వులో పార్వతిదేవి నివాసంగా చెబుతారు.