Vinayaka Chaturthi: వినాయక చవితి రోజున అస్సలు చేయకూడని తప్పులు, పనులు..

గణపయ్యను పూజించే వారు కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. చవితి రోజున అస్సలు చేయకూడని పనులు, తప్పులు కొన్ని ఉన్నాయి. (Vinayaka Chaturthi)

Vinayaka Chaturthi: భారతీయుల అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. పార్వతీ పరమేశ్వరుల తనయుడు వినాయకుని పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు చవితి పండుగ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజుల్లో మనం గణనాధుడిని ఇళ్లకు ఆహ్వానిస్తాం. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాం. అనంతరం నిమజ్జనం చేస్తాం.

గణపయ్యను పూజించే వారు కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. చవితి రోజున అస్సలు చేయకూడని పనులు, తప్పులు కొన్ని ఉన్నాయి. వాటిని పాటించినప్పుడే మన పూజ పరిపూర్ణం అవుతుంది. దైవానుగ్రహానికి అర్హులం అవుతాం. లేదంటూ పూజ ఫలితాలను పొందలేము. మరి గణేశ్ చవితి రోజున చేయకూడనివి ఏంటో తెలుసుకుందామా..

* చంద్రుడిని చూడకూడదు (ఎందుకంటే వినాయక చవితి రాత్రి చంద్రుడిని చూడడం అశుభంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం గణేశుడి రూపాన్ని చంద్రుడు ఎగతాళి చేయడం వల్ల ఆయనకు శాపం వచ్చింది. గణేశ్ చతుర్థి రోజున చంద్రుడిని పొరపాటున చూసినా, శమంతక మణి కథను చదవడం వల్ల దోషం తొలగుతుందని నమ్మం)
* విరిగిన విగ్రహాన్ని ప్రతిష్టించొద్దు (విరిగిన విగ్రహాన్ని ఇంటికి తేవడం లేదా పూజించడం శుభప్రదం కాదు)
* ఇంట్లో ఒకేసారి రెండు గణేశ విగ్రహాలను పూజించకూడదు
* తామర ఆహారం వద్దు (ఇంట్లో గణనాధుడిని ప్రతిష్టించే రోజుల్లో మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మద్యం కలిగిన తామర ఆహారాలకు దూరంగా ఉండాలి)
* తులసిని ఉపయోగించొద్దు (పూజలో తులసి ఆకులను ఉపయోగించొద్దు. పురాణాల ప్రకారం తులసి దేవి గణపతిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన నిరాకరిస్తాడు. ఆమెను శపిస్తాడు)

Also Read: గణేశ్ చతుర్థి ఆగస్టు 26ననా? లేక ఆగస్టు 27ననా? పూజ ముహూర్తం, తేదీ, సమయం వివరాలు..

* నలుపు, నీలం దుస్తులు ధరించొద్దు (పూజ సమయంలో నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించకూడదు. ఎరుపు, పసుపు వంటి శుభ రంగులలో దుస్తులు ధరించాలి
* విగ్రహాన్ని నేలపై ఉంచకూడదు. చెక్క లేదా పీఠంపై మాత్రమే ఉంచాలి. దానిపై ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరిచి ప్రతిష్టించాలి.
* విగ్రహాన్ని సముద్రంలో లేదా నదిలో పడవేయకూడదు. భక్తితో నీటిలో నెమ్మదిగా ముంచి గణపతి బప్ప మోరియా మంత్రాన్ని జపించాలి.
* విగ్రహాన్ని విరగ్గొట్టకూడదు.
* నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు, ఇంట్లో హారతి చేసి ఇష్టమైన ఆహారాన్ని ఇచ్చి పంపాలి.
* సమీపంలో నదులు, కెనాల్స్ వంటివి లేని వారు ఇంట్లోనే పెద్ద బకెట్ లేదా ట్యాంక్‌లో నీటితో నింపి, అందులో విగ్రహాన్ని కరిగించడం ఉత్తమం.

* పీవోపీ, పేపర్లు, కెమికల్స్ తో చేసిన గణపతులను పూజించొద్దు
* బంక మట్టితో చేసిన గణపతిని మాత్రమే తెచ్చి పూజించాలి
* ఇంటికి తెచ్చుకునే మహా గణపతి చతుర్ భుజుడై ఉండాలి (నాలుగు చేతులు)
* అభయ హస్తాన్ని చూపిస్తూ ఉండాలి
* రెండు దంతాలు పూర్తిగా ఉండకూడదు
* మహా గణపతికి యజ్ఞోపవీతం ఉండాలి

Also Read: వినాయకుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదాలు ఇవే.. చేసే పద్ధతి..