Siva Mukkoti Representative Image (Image Credit To Original Source)
Siva Mukkoti: జనవరి 3వ తేదీ.. శనివారం.. శివ ముక్కోటి.. ఆరుద్రోత్సవం, పుష్య పూర్ణిమ.. ఈ సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, ఆరుద్రోత్సవం శివ ముక్కోటికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, పుష్య పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం.
జనవరి 3వ తేదీ చాలా శక్తిమంతమైన రోజు. వైష్ణవ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉంతో శైవ సంప్రదాయంలో ఆరుద్రోత్సవానికి అంతే ప్రాధాన్యత ఉంది. దీన్ని శివ ముక్కోటి అనే పేరుతో పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి ఏ విధంగా ముక్కోటి ఏకాదశి అవుతుందో అదే విధంగా శైవ సంప్రదాయంలో ఆరుద్రోత్సవం అనేది శివ ముక్కోటి అవుతుంది. అది ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు.
జనవరి 3న ఎవరైతే ఉదయం 7 గంటల లోపు ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటారో వాళ్లు జన్మజన్మలపాటు శివానుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు. అలాగే శనివారం రోజున సూర్యోదయానికి పూర్వమే ఎవరు శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసుకుంటారో, శివాలయంలో అభిషేకం చేయించుకుంటారో వాళ్లకి జన్మజన్మల పాపాలు, దరిద్రాలు అన్నీ పోగొట్టుకుని నవగ్రహాలను ఏక కాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. అంతటి శక్తి జనవరి 3 శివ ముక్కోటి పర్వదినానికి ఉంది. గుడికి వెళ్లే వీలు లేని వాళ్లు ఇంట్లోనే శివాభిషేకం చేసుకుని అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ధనుర్మాసంలో ఏ రోజు అయితే ఆరుద్ర నక్షత్రం ఉంటుందో ఆరోజు శివ ముక్కోటి వస్తుంది.
శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్వేశరాయ, నమ: శ్రీం శివాయ నమ: అనే మంత్రాలు వీలైనన్ని సార్లు చదువుకుంటే జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. శివాలయంలో కూర్చుని చదివితే ఇంకా అద్భుత ఫలితాలు పొందుతారు. గ్రహ దోషాలు పట్టి పీడిస్తున్న వాళ్లు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జనవరి 3న శివాలయంలో కూర్చుని వీలైనన్ని సార్లు పఠించడం వల్ల విశేష ప్రయోజనాలు దక్కుతాయి. జనవరి 3 ఆరుద్రోత్సవం, శివ ముక్కోటి.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జన్మజన్మల పాపాలు, దారిద్ర్య బాధలు తొలగింపజేసుకుని ప్రతి ఒక్కరు శివానుగ్రహానికి పాత్రులు కండి.