పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ఇచ్చే పురుహూతికా దేవి.. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి

దేవిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని చాలా మంది విశ్వాసం. వివాహ సమస్యలు తొలగుతాయని భక్తులు చెబుతారు.

Puruhutika Devi

Puruhutika Devi Temple: దక్షయజ్ఞం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో సతీదేవి పీఠభాగం పడిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం. కుకుటేశ్వర స్వామి సమేతంగా పురుహూతికా దేవి వెలసింది. అమ్మవారి పీఠభాగం పడిన ప్రాంతం కాబట్టి దీనికి పిఠాపురం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. హూంకారిణిగానూ అమ్మవారు పూజలందుకుంటారు.

ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి పురుహూతికా దేవి ఆలయం. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోనే పురుహూతికా అమ్మవారి ఆలయం ఉంటుంది. శివుడు, శక్తి ఇద్దరూ ఒకే ప్రాంగణంలో ఉండటం ఈ క్షేత్రానికి ప్రత్యేకత. పురుహూతికా దేవి స్వరూపం ఎంతో ఉగ్రరూపంలో ఉంటుంది. ఆలయంలో అమ్మవారిని శాంతి కలిగించే రూపంలో పూజిస్తారు. (Puruhutika Devi Temple)

ఈ దేవిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. ధనసంపద, ఐశ్వర్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. పురుహూతికా దేవిని మహా శక్తిగా భావిస్తారు. ఆలయంలో అమ్మవారికి నిత్య పూజలు, నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రుల్లో ఇక్కడ భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తారు. పిఠాపురంలో ఒకేసారి శివ, శక్తి దర్శనం కలగటం విశేషం.

పురుహూతికా దేవి ఆలయం చరిత్రాత్మకంగా ఎంతో పురాతనమైనది. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోని ముఖ్యమైన తీర్థయాత్రాకేంద్రాలలో ఒకటి. దేవిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని చాలా మంది విశ్వాసం. వివాహ సమస్యలు తొలగుతాయని భక్తులు చెబుతారు. ఈ ఆలయం సమీపంలో పలు పురాతన శిల్పాలు, శాసనాలు కనబడతాయి.