Kaal Sarp Yog (Image Credit To Original Source)
Rahu Remedies: రాహువుకు రెమెడీస్ ఉన్నాయి. కొన్ని వస్తువుల దానాలు ఇవ్వడం, ప్రత్యేక పూజలు చేయడం వంటివి చేయొచ్చు.
1) కాలసర్పయోగ పుస్తకములు నలుగురికి దానము చేయండి.
2) గోమేధికం దానం ఇవ్వడం.
3) గొడుగు, పాదరక్షలు దానం ఇవ్వడం.
4) ముల్లంగి దుంపలు దానం ఇవ్వడం.
5) నాగప్రతిమ దానం చేయడం.
6) చెల్లని నాణెములను ప్రవహించే నీటిలో వదలడం
8) యవలను పాలల్లో కడిగి ప్రవహించే నీటిలో వేయాలి.
9) చిన్న వెండి పాత్రను బ్రాహ్మణులకు దానం చేయండి
10) ఇనుముతో పాముబొమ్మ చేయించి నైఋతిలో పాతిపెట్టడం.
11) ప్లాస్టిక్ సామానులు ఎక్కువ వాడండి.
12) గోమేధికం ధరించండి.
13) వెండితో చేసిన అయస్కాంతపు ఉంగరాన్ని ధరించండి
14) రాహువు జపం బ్రాహ్మణులచే చేయించండి.
15) గోధుమలు, బెల్లం, ఇత్తడి కలిపి దానం ఇవ్వండి.
16) వెండితో ఏనుగు బొమ్మ చేయించి ఇంటిలో ఉంచండి.
17) కొబ్బరికాయను ప్రవహించే నీటిలో వేయండి.
18) వెండి గ్లాసులో పాలుతాగండి.
19) ఇంటిలో దంతంతో చేసిన వస్తువులు పెట్టకండి
20) దుర్గాదేవి ఫొటోను ఈశాన్యంలో ఉంచి పూజించండి.
21) మసూరపప్పు 2కిలోలు దానం చేయండి.
23) వెండి జంటసర్పాలు శనివారం గాని, ఆదివారం గాని, చవితిరోజునగాని, పంచమిరోజునగాని, పుట్టలో వేసి, ఆవుపాలు పోయిండి.
24) రాగిజంటసర్పాలు, ఆరుద్రనక్షత్రము రోజునగాని, స్వాతినక్షత్రము రోజున గాని, శతభిషనక్షత్రము రోజునగాని పుట్టలో వేసి, ఆవుపాలు పోయండి.
25) బంగారు జంటసర్పాలు చవితిరోజునగాని, పంచమి రోజున గాని బ్రాహ్మణులకు దానం ఇచ్చి, శక్తికొలది ధనము ఇవ్వండి.
26) గోమేధికం, కొబ్బరి, ముల్లంగి, చెల్లని నాణేలు, బొగ్గు.. ఇవి శనివారము రోజున కుష్టు రోగికి దానం చేయాలి.
27) పాలలో బార్లిగింజలు వేసి నదిలో వేయుట
28) ఆవు మూత్రముతో నోరు శుభ్రపరుచుకోవాలి
29) గొడుగు, గవ్వలు, ఏనుగు, గోమేధికం దానం చేయవలెను.
30) ఆవాలు లేక నువ్వులు లేక అలచందలు, గోమేధికము లేక నీలము రాయిని పనిమనిషికి దానము చేయాలి.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ